సుమంత్ 'బోణి' కొడతాడా?

By Staff

Sumanth
అదేంటో గాని కెరీర్ ప్రారంభం నుండి సుమంత్ కి కష్టాలే. మొన్న సంక్రాంతి రిలీజైన 'పౌరుడు' ఎంత పబ్లీసిటీ చేసినా సోది లోకి కూడా లేకుండా పోయాడు. అంతకు ముందు రూటు మార్చి చేసిన 'గోదావరి' కూడా మంచి పేరు తెచ్చుకున్నా అంతంత మాత్రం కలెక్షన్స్ తో నిర్మాతకు నష్టాలు తెచ్చి పెట్టింది. దాంతో తనని అసలు ప్రేక్షకులు ఎలా చూడాలుకుంటున్నారో అర్ధం కాని డైలమాలో పడ్డాడు సుమంత్. కొంత కాలం పోతే నవీన్ లా ఫేడ్అవుట్ అయ్యే ప్రమాదం కూడా ఉందని తలపట్టుకుంటున్నాడు. ఈ స్ధితిలో సంగీత దర్శకుడు రమణ గోగుల నిర్మాతగా మారి అతనితో 'బోణి' అనే సినిమా తీయటానికి ముందుకొచ్చాడు.

ఆయన తాజాగా గ్రీన్ మ్యాంగోస్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి దానిపై తొలిగా ఈ సినిమా తీద్దామనుకుంటున్నాడు. ఈ సినిమా ద్వారా రాజ్ పిప్పల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మే మూడవ వారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది. ఈ సినిమాకు 'బోణి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. దాదాపు అదే ఖరారయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. దర్శకుడు రాజ్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ సినిమాకు రమణ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కొత్త కథతో వచ్చే ఈ సినిమాలో సుమంత్ కొత్త గెటప్స్ లో కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతోఈ సినిమాపై అతను చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా తో అయినా హిట్టుకు బోణి కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X