దేవుడికే కోసం వస్తే.. ఉత్కంఠ రేపుతున్న సుబ్రమణ్యపురం ఫస్ట్ లుక్!
మళ్ళీ రావా చిత్రంతో హీరో సుమంత్ తిరిగి పుంజుకున్నాడు. ప్రస్తుతం సుమంత్ సుబ్రమణ్య పురం అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఉత్కంఠ రేపుతోంది. ఉత్కంఠ కలిగించే ఆధ్యాతిక అంశాలతో, వైవిధ్య భరితమైన కథతో ఈ చిత్రం సాగుతుందట.
తాను ఇష్టపడిన అమ్మాయి కోసం, ఓ గ్రామం కోసం ఏకంగా దేవుడినే ఎదిరించే యువకుడిగా ఈ చిత్రంలో సుమంత్ కనిపించబోతున్నాడు. ఇంతకీ దేవుడినే ఎదిరించాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఆ గ్రామానికి వచ్చిన కష్టం ఏమిటి అనే విషయాలు వెండి తెరపైనే తెలుసుకోవాలి.

సుమంత్ సరసన ఈషరెబ్బ హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష్ జాగర్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు నాటికి చిత్రకరణ పూర్తి చేస్తామని చిత్ర యూనిట్ చేబోతోంది. తాజగా విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











