Mem Famous Twitter Review: మేమ్ ఫేమస్‌కు అలాంటి టాక్.. అదే మైనస్‌గా.. ప్రభాస్ ఎలా చేశాడంటే!
గతంలో కంటే ఇప్పుడు కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ల వెలుగులోకి వస్తున్నారు. అలా ఇప్పుడు వచ్చిన చిత్రమే 'మేమ్ ఫేమస్'. దీని ద్వారా సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా టాలీవుడ్‌లో పరిచయం అవుతున్నాడు. విడుదలకు ముందే ఈ చిత్రం ప్రచారం ద్వారా చాలా హాట్ టాపిక్‌గా మారింది. ఫలితంగా మంచిగానే అంచనాలను ఏర్పరచుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'మేమ్ ఫేమస్' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమాకు ట్విట్టర్ టాక్ ఏంటో మీరు కూడా చూడండి!
మేమ్ ఫేమస్ అంటూ రచ్చ: హీరో సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'మేమ్ ఫేమస్'. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, అంజి తదితరులు కీలక పాత్రలను పోషించిన ఈ సినిమాను చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్‌లు నిర్మించారు. దీనికి కల్యాణ్ మాణిక్ సంగీతం ఇచ్చారు. ఈ చిత్రం మే 26వ తేదీన ఎంతో గ్రాండ్ విడుదలైంది.

అలాంటి కథ.. ఎంతో ఫన్‌తో: ఊరిలో అల్లరి చిల్లరిగా తిరిగే కొందరు కుర్రాళ్లు.. ప్రేమలో పడడం.. ఆ తర్వాత ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న తర్వాత.. ఫేమస్ అవ్వాలనే లక్ష్యంతో ఓ పని మొదలు పెడతారు. అందులో వాళ్లు సఫలం అయ్యారా? ఇంతకీ వాళ్ల ప్రేమను గెలిపించుకున్నారా? అనే అంశాలతో 'మేమ్ ఫేమస్' మూవీ రూపొందింది. ఇందులో కామెడీ ప్రధానమైన సీన్స్ చాలానే ఉన్నాయి.
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్: 'మేమ్ ఫేమస్' సినిమాను వీక్షించిన ఓ నెటిజన్ 'మేమ్ ఫేమస్ మూవీ ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఇది సరిగానే టేకాఫ్ అయినా.. ల్యాండింగ్‌లో విఫలం అయింది. కొన్ని కామెడీ సీన్స్ బాగా రాశారు. కానీ, స్క్రీన్‌ప్లే డల్‌గా ఉండడం.. ఎమోషన్స్ అతికించినట్లుగా ఉన్నాయి. సంగీతం డీసెంట్‌గా ఉంది. ఇది ఒక్కో సందర్భంలో షార్ట్ ఫిల్మ్‌లా అనిపించింది' అని చెప్పుకొచ్చాడు.

అన్నీ రకాలుగా చేస్తుంది: క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'మేమ్ ఫేమస్' సినిమాను వీక్షించిన ఇంకో నెటిజన్ ఇలా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో 'మేమ్ ఫేమస్ అనే మూవీ మిమ్మల్ని నవ్వించేలా, ఏడ్చేలా, ఆలోచించేలా చేసే ఒక అద్భుతమైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాను కొత్త వాళ్లు చేశారంటే నమ్మలేరు. ఇక్కడ భవిష్యత్‌లో ఉపయోగపడే చాలా చాలెంట్ ఉంది' అని చెప్పాడు.

ఓవరాల్‌గా ఎలా ఉందంటే: ఇప్పటి వరకూ చూసిన ట్వీట్ల ప్రకారం.. సుమంత్ ప్రభాస్ నటించిన 'మేమ్ ఫేమస్' మూవీకి మిక్స్‌డ్ టాక్ మాత్రమే వచ్చింది. ఇందులో మొత్తంగా పల్లెటూరి వాతావరణంతో పాటు కామెడీ ఆకట్టుకునే విధంగా ఉందట. కానీ, సెకెండాఫ్ ల్యాగ్ అవడం, ఎమోషన్స్ అంతగా పండకపోవడం మైనస్ అని అంటున్నారు. ఓవరాల్‌గా ఈ సినిమా అయితే వన్ టైం వాచ్‌బుల్ అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











