సుమంత్, ప్రియమణిల మధ్య హాట్ గా 'రిమ్ జిమ్'...
సుమంత్, ప్రియమణి కలిసి తాజాగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రంలో లిప్ టు లిప్ కిస్ కూడా ఉంది. ఎప్పుడూ అటువంటి సీన్స్ కు బాగా దూరంగా ఉండే సుమంత్...ఈసారి ప్రియమణికి పూర్తి స్ధాయిలో సహకరించి ఈ సీన్ ని పండించాడుట. ఇక ఈ చిత్రానికి రిమ్ జిమ్ అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే స్క్రీన్ పైనే కాక స్క్రీన్ బయిట కూడా ఈ జంట ఒకరినొకరు విడిచిపెట్టకుండా కలిసి తిరుగుతున్నారని అంతటా వినపడుతోంది. డల్ గా ఉండే సుమంత్ లో వేడి రగల్చిన ఘనత ప్రియమణిదే అని అంటున్నారు. ఇక ఈ చిత్ర నిర్మాతలు కుమార్ బ్రదర్శ్...గతంలో నా గర్లె ప్రెండ్ బాగా రిచ్, సాధ్యం చిత్రాలు రూపొందించారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తయారయ్యే ఈ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు సుమంత్ ప్రస్తుతం రవి.సి.చావలి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అలాగే అష్టాచెమ్మతో పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అతని సరసన స్వాతి హీరోయిన్ గా చేస్తోంది. ఇక కుమార్ బ్రదర్శ్..సాధ్యం చిత్రంలో ప్రియమణి, జగపతి బాబు కాంబినేషన్లో చేసారు. అలాగే నా గర్లెప్రెండ్ బాగా రిచ్ చిత్రాన్ని శివాజీ, కావేరీ ఝాలతో రూపొందించారు. రెండు చిత్రాలకూ కొత్త దర్శకులనే ఎంపికచేసారు. కానీ రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చాయి.అసలే వరస ఫ్లాపుల్లో ఉన్న సుమంత్ ఈ చిత్రాన్ని ఏ మేరకు గట్టెక్కిస్తారో గానీ..ప్రియమణితో మాత్రం రొమాన్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడంటున్నారు.


Click it and Unblock the Notifications











