నారీ నారీ నడుమ రాజ్(రాజ్ చిత్రం ప్రివ్యూ)
సుమంత్, ప్రియమణి, విమల రామన్ కాంబినేషన్ లో వియన్ ఆదిత్య తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ రాజ్. ఈ చిత్రం ఈ రోజు(శుక్రవారం) విడుదల అవుతోంది. ఈ చిత్రం కథ విషయానకి వస్తే రాజ్ (సుమంత్) వృత్తిరీత్యా ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. అతనికి ప్రియ (విమలారామన్) పరిచయం అవుతుంది. వీరిద్దరి మధ్యకి మైథిలి (ప్రియమణి) పాత్ర ప్రవేశిస్తుంది. ఈ ముగ్గురి ఆలోచనలూ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఆధునిక భావాలకు ప్రతీకలుగా కనిపిస్తారు. ఇంతకీ మైథిలికీ రాజ్‌కీ ఉన్న సంబంధం ఏమిటి అనేది కథలో ఆసక్తికరమైన విషయం. ఈ ఇద్దరు యువతులతో రాజ్ ఎలా నెట్టుకొచ్చాడో, ఎన్ని పాట్లుపడ్డాడో తెర మీదే చూడాలి.
ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ...ప్రేమ, వినోదం కలబోసిన సినిమా ఇది. ప్రతి నాలుగు సన్నివేశాలకు కథ ఓ మలుపు తిరుగుతుంది. ముక్కోణపు ప్రేమ కథలు మనకు కొత్త కాకపోవచ్చు. కానీ వైవిధ్యంగా తెరకెక్కించిన తీరు ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో ఉత్కంఠత కలిగించే సన్నివేశాలున్నాయి. గోవా, కులుమనాలీల్లో పాటలు తెరకెక్కించాం. 'భీమవరం బుల్లోడా' పాట రీమిక్స్ మాస్‌కి బాగా నచ్చుతుంది అంటున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితోనూ, విమలారామన్ తోనూ లిప్ లాక్ కిస్సులు ఉన్నాయంటూ ప్రచారం చేసారు. ఈ చిత్ర నిర్మాతలు గతంలో ప్రియమణితో సాధ్యం అనే చిత్రం తీసారు.
సంస్థ: కుమార్ బ్రదర్స్ సినిమా
నటీనటులు: సుమంత్, ప్రియమణి, విమలా రామన్, అలీ, గిరిబాబు, అజయ్, వైజాగ్ ప్రసాద్ తదితరులు.
సంగీతం: కోటి
కూర్పు: కె.వి.రెడ్డి
ఫైట్స్: గణేష్
కెమెరా: జగన్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎ.పాండురంగ.
దర్శకత్వం: వి.ఎన్.ఆదిత్య


Click it and Unblock the Notifications











