వైఎస్ జగన్, నేనూ గోడదూకే ప్లాన్ చేసాం, తాతయ్య వచ్చేసారు: ఆనాటి సంఘటనని చెప్పిన అక్కినేని హీరో
Recommended Video

తనకూ.. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాన్ని ఈ మధ్య ఇంటర్వ్యూలో బయట పెట్టాడు నటుడు సుమంత్. చిన్నపుడు తామిద్దరం చేసిన అల్లరి చిల్లరి పనులను టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్‌గా చేసే ఓ కార్యక్రమంలో సుమంత్ ఏమాత్రం దాచిపెట్టకుండా వెల్లడించాడు. ప్రస్తుతం ఈ అంశాలపైనే సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ...

ఇద్దరూ క్లాస్ మేట్స్
ఇంతకీ సుమంత్‌కు జగన్ మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి అంటే... సుమంత్, జగన్ ఇద్దరూ క్లాస్ మేట్స్. ఇద్దరి మధ్య మాంచి దోస్తీ ఉండేదట. అక్కినేని వారి ఇంట్లో సుమంత్‌ది మేడ మీద గది... ఒక రోజు రాత్రి సుమంత్, జగన్ ఇద్దరూ బయట డిన్నర్ చేయడానికి వెళ్లి ఆలస్యంగా వచ్చారట.

క్లాసు పీకుతారని
రాత్రి 12 అయిపోయింది.. సుమంత్ తాళాలు మర్చిపోయాడు.. సో గదిలోకి వెళ్లాలంటే ఇంట్లోవాళ్లను లేపాలి, లేదంటే బాల్కనీలోకి వెళ్లి అక్కడి నుంచి గదిలోకి వెళ్లాలి. ఇంట్లో వాళ్లను నిద్రలేపితే.. తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు నిద్రలేచి క్లాసు పీకుతారని సుమంత్ భయం.

సుమంత్ ప్లాన్
దాంతో బాల్కనీలోకి ఎక్కి అక్కడి నుంచి గదిలోకి వెళ్దామని సుమంత్ ప్లాన్ చేశాడు. దాంతో బాల్కనీలోకి ఎక్కడానికి సుమంత్ ప్రయత్నిస్తుంటే కింద నుంచి జగన్ ఆయనకు హెల్ప్ చేస్తున్నాడట... ఈ హడావుడంతా జరుగుతూ సుమంత్ అలా బాల్కనీకి వేలాడుతున్న సమయంలో అక్కినేని నిద్రలేచి బయటకొచ్చేశారు..

నైస్ టూ మీట్ యూ
ఆయన్ను చూడగానే సుమంత్ కు గొంతు తడారిపోయిందట. ఏం చెప్పాలో తెలియక... జగన్ ను చూపిస్తూ.. ‘‘తాతా.. జగన్.. రాజశేఖరరెడ్డిగారి అబ్బాయి'' అని చెప్పాడట. అందుకు అక్కినేని... "నైస్ టూ మీట్ యూ" అని అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయారట.

బిజీ జీవితాలు
అదంతా చదువుకునే రోజుల్లో జరిగిందని... తాను తాళాలు మరచిపోయినందునే అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆనాటి రోజులు మళ్లీ రావన్నాడు. ఇద్దరం మంచి స్నేహితులమని.. బిజీ జీవితాల కారణంగా తరచూ కలుసుకోలేకపోతున్నామని చెప్పాడు.


Click it and Unblock the Notifications











