ఇద్దరు సెక్సీ హీరోయిన్స్ మద్య ఇరుకొన్న హీరో...
కథానాయకుడు సుమంత్ ఒకేసారి ఇద్దరు భామలతో రొమాన్స్ చేస్తున్నారు. ఇద్దరితో ఆడిపాడుతున్నారు. తన తాజా చిత్రంలో సుమంత్ ప్రియమణి, విమలారామన్ ముఖ్యతారలుగా కుమార్ బ్రదర్స్ సినిమా పతాకంపై ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య దర్శక్తంలో కుమార్ బ్రదర్స్, గౌటి హరినాథ్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ 'సుమంత్ ఇమేజ్ కు సరిపోయే ఓ నవ్యమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. హైదరాబాద్ మరియు గోవా లోని జరిగిన భారీ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తయింది. అన్ని కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రం సుమంత్ కెరీర్ లో మరపురాని చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం వుందన్నారు. ఈ చిత్రాన్నిడిసెంబర్ లోవిడుదల చేయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. సుమంత్ కు సరిపోయే కథతో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈచిత్రంలో అన్ని వర్గాల మెప్పించే అంశాలున్నాయి. త్వరలో టైటిల్ ను కూడా అనౌన్స్ చేస్తాం అని దర్శక నిర్మాతలు తెలిపారు.


Click it and Unblock the Notifications











