ఏఎన్ఆర్, రాజమౌళి, సుకుమార్ ఏమో గుర్రం ఎగరవచ్చు
హైదరాబాద్ : సుమంత్ హీరోగా చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఏమో గుర్రం ఎగరవచ్చు' చిత్రం ప్రారంభోత్సవం కార్యక్రమం ఈ రోజు రామానాయుడు స్టూడియోలో జరిగింది. తొలి సన్నివేశానికి సుమంత్ తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు క్లాక్ కొట్టగా దర్శకుడు రాజమౌళి కెమెరా స్విచాన్ చేసారు. సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
రచయిత, దర్శకుడు మదన్ 'ఆ నలుగురు ఫిలిమ్స్' పతాకంపై ఈ సినిమా నిర్మించబోతున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరకర్త. రాజమౌళి 'మర్యాద రామన్న'కు కథ అందించి, 'ఈగ'కు స్క్రిప్టు రైటర్ గా పనిచేసిన కాంచి ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు.
హీరో సుమంత్ మాట్లాడుతూ...నేను ఇది వరకు చాలా గ్యాప్ తీసుకున్న చేసిన సత్యం, గోల్కొండ్ హైస్కూల్ సినిమాలు హిట్టయ్యాయి. ఈ సినిమా కూడా చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్నాను. హిట్టవుతుందనే నమ్మకం ఉంది. స్క్రిప్టు బాగుంది. క్లాసు, మాసు కలగలిపి ఉంటుంది. కామెడీ బాగానే ఉన్నా ఫీల్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు.

ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొడుతున్న అక్కినేని నాగేశ్వరరావు

ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమా ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేస్తున్న రాజమౌళి, పక్కన మరో దర్శకుడు సుకుమార్

ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్కినేనితో కీరవాణి, రాజమౌళి కబుర్లు

ఈ సినిమాకు రచయితగా పని చేస్తున్న కాంచితో హీరో సుమంత కబుర్లు

ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్కినేనితో కీరవాణి, రాజమౌళి కబుర్లు

ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, మరో దర్శకుడు సుకుమార్ ముచ్చట్లు

కీరవాణి దంపతులతో రాజమౌళి ‘ఏమో గుర్రం ఎగరవచ్చు' చిత్రం ప్రారంభోత్సవానికి హాజరైన దృశ్యం

‘ఏమో గుర్రం ఎగరవచ్చు' యూనిట్ సభ్యులతో అక్కినేని
దర్శకుడు చంద్రసిద్దార్థ్ మాట్లాడుతూ, 'మధుమాసం' తర్వాత సుమంత్ కాంబినేషన్ లో మళ్లీ ఈ సినిమా చేస్తున్నాను. దర్శకునిగా నాకెంతో పేరు తీసుకువచ్చిన 'ఆ నలుగురు'కు మదన్ కథ అందించారు. ఇప్పుడు అతని సంస్థలో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం సంగీత చర్చలు జరుగుతున్నాయి. కీరవాణిగారితో తొలిసారి పని చేస్తున్నాను. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందుస్తున్నారు. సగం ఇండియాలోనూ, సగం అమెరికాలోనూ కథ జరుగుతుంది" అని చెప్పారు. ఈచిత్రానికి కథ-మాటలు : ఎస్.ఎస్. కాంచి, కెమెరా : చంద్రమౌళి, ఆర్ట్స్ : నాగేంద్రబాబు, పాటలు : చైతన్య ప్రసాద్, సంగీతం : ఎంఎం. కీరవాణి, స్ర్కీన్ ప్లే-నిర్మాత : మదన్, సమర్పణ : నీల శంకర్, దర్శకత్వం : చంద్ర సిద్ధార్థ.


Click it and Unblock the Notifications











