»   » కామెడీ సాయంతో... ('ఏమో గుర్రం ఎగరావచ్చు' ప్రివ్యూ)

కామెడీ సాయంతో... ('ఏమో గుర్రం ఎగరావచ్చు' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వరస ఫ్లాపుల్లో ఉన్న సుమంత్ ఈ సారి నవ్వించి హిట్ కొడతానంటూ 'ఏమో గుర్రం ఎగరావచ్చు' చిత్రంతో ముందుకు వస్తున్నాడు. ఈ రోజు విడుదల అవుతున్న ఈ చిత్రం ట్రేడ్ లో మంచి క్రేజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో సుమంత్ బుల్లబ్బాయ్ గా కామెతో కూడిన ఓ విలక్షణమైన పాత్రను పోషించారు. కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. పాటలు ఇప్పటికే మంచి హిట్టయ్యాయి.

.జీవితంలో ప్రతి విషయం పద్ధతిగా జరగాలనుకునే అమ్మాయికి, ప్రణాళికలు అవసరం లేదనుకునే అబ్బాయికి మధ్య జరిగే కథే ఈ సినిమా.ఇందులో సుమంత్ ..బుల్లెబ్బాయ్‌గా కనిపిస్తాడు. పల్లెటూరి బైతు. పదోతరగతి పద్నాలుగుసార్లు తప్పిన బుల్లెబ్బాయ్‌కి ఓ కోరిక ఉంది. అదే.. అమెరికాకు వెళ్లడం. మరి వెళ్లాడో లేదో తెరపై చూసి తెలుసుకోవలసిందే.
తొలిసారి ఈ సినిమాకోసం చీర కట్టారు. అదీ కథలో భాగంగానే వస్తుంది.

Sumanth's Emo Gurram Egaravachu preview

సుమంత్ ..కెరీర్‌లో ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర చేయలేదు. నాకే షాకింగ్‌గా అనిపించింది. సినిమా అంతా నవ్విస్తూనే ఉంటా. కథ వినగానే 'ఇది రవితేజ, సునీల్‌ చేయాల్సిన సినిమా' అనిపించింది. 'ఏమో గుర్రం ఎగరావచ్చు' టైటిల్‌ కూడా ఆసక్తి రేకెత్తించింది. 'ఇలాంటి టైటిల్‌ ఏంటి?' అనుకొన్నా. అయితే ఆ తరువాత ఈకథకి ఈ పేరే కరెక్ట్‌ అనిపించింది. కీరవాణిగారు అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. నా సొంత సినిమా అనుకొని పనిచేశారాయన'' అన్నారు.

అలాగే ''తొలిసారి ఈ సినిమాకోసం చీర కట్టా. అదీ కథలో భాగంగానే వస్తుంది. చంద్రసిద్దార్థ్‌ చీర సంగతి చెప్పిప్పుడు 'అవసరమా?' అని అడిగా. కానీ ఆయన సందర్భం చెప్పిన తరవాత కాదనలేకపోయా. ఈ సినిమా ఇంట్లోవాళ్లకు చూపించా. తాతగారికి బాగా నచ్చింది. సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుకొన్నారు. ఈమధ్య తాతగారు సినిమాలెక్కువగా చూసారు. ఈమధ్య కాలంలో నేనూ అన్ని సినిమాలు చూళ్లేదేమో..?'' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ "సినిమా ఆద్యంతం చాలా బాగా వచ్చింది. టైటిల్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. సుమంత్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తారు. ఓ సందర్భంలో లేడీ గెటప్‌లోనూ కనిపిస్తారు. సుమంత్ లేడీ గెటప్ స్టిల్స్‌కు చక్కటి రెస్పాన్స్ వస్తోంది. ఇదొక రొమాంటిక్‌ ఎంట ర్‌టైనర్‌. ఆధునిక దృక్పథం ఉన్న అమ్మాయికి, పల్లెటూరి కుర్రాడికి మధ్య సాగే వినోదాత్మక కథ ఇది'' అని అన్నారు.


బ్యానర్ : చెర్రీ ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్
నటీనటులు : సుమంత్, పింకీ సావిక, కాంచి తదితరులు
కథ,మాటలు: కాంచి
కెమెరా : చంద్రమౌళి,రాజేంద్ర
ఆర్ట్: నాగేంద్ర
స్టైలింగ్ :సీత కాంచి
ఎడిటింగ్: జీవి చంద్రశేఖర్
సంగీతం: కీరవాణి
నిర్మాత: పూదోట సుధీర్‌కుమార్
స్క్రీన్ ప్లే,దర్శకత్వం: చంద్ర సిద్దార్ధ

English summary
Treading a cautious path Sumanth finally chose Emo Gurram Egaravachu directed by Chandra Siddhartha where he is cast opposite Thai actress Pinky Savika. Sumanth play this character who struggles to pass class X. He has appeared 14 times for the exam but has not passed it. It’s a high energy village character who wants to get a visa to go to the United States. How he goes about is what the film is all about.
Please Wait while comments are loading...