సుమంత్ గోదావరి హీరోయిన్ నీతూ చంద్రకు బుల్లెట్ గాయాలు
గోదావరి సినిమాలో సుమంత్ హీరోయిన్ నీతూ చంద్రకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. తమిళ సినిమా ఆది భగవాన్ సినిమా షూటింగ్ సందర్బంగా మంగళవారం ఆమె గాయపడింది. జయం రవి సరసన ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. థాయ్ లాండ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బుల్లెట్ పేల్చిన దృశ్యాన్ని చిత్రీకరిస్తుండగా మిస్ ఫైర్ అయి ఆమె పెదవులకు గాయమైంది. ఆమె పెదవులకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. ఆమెకు 24 గంటల చికిత్స అవసరమని, మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. బుల్లెట్ కొన్ని మిల్లీమీటర్ల దూరం నుంచి దూసుకుపోయిందని, దాని వేడికి పెదవులు కాలిపోయాయని చెప్పారు.


Click it and Unblock the Notifications











