క్రేజీ కాంబినేషన్ లో సుమంత్ చిత్రం ఖరారు
దర్శకుడు మాట్లాడుతూ ''సగం భారతదేశంలో, సగం అమెరికాలోనూ సాగే కథ ఇది. సుమంత్ పాత్ర యూత్ ను తప్పకుండా ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం సంగీత చర్చలు జరుగుతున్నాయి. చైతన్యప్రసాద్ సాహిత్యం అందిస్తున్నారు. దర్శకునిగా నాకెంతో పేరు తీసుకొచ్చిన 'ఆ నలుగురు'కు మదన్ కథ అందించారు. అటువంటిది ఇప్పుడు అతని సంస్థలో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.'' అన్నారు. 'మధుమాసం' తర్వాత సుమంత్,చంద్ర సిద్దార్ద చేస్తున్న చిత్రం ఇదే.
నిర్మాత మదన్ మాట్లాడుతూ -''పెళ్లైన కొత్తలో' తర్వాత 'ఆ నలుగురు ఫిలిమ్స్' సంస్థలో ఈ చిత్రం నిర్మిస్తున్నాను. చంద్రసిద్ధార్థ్ 'ఆ నలుగురు'కి కథను అందించాను. ఆ పేరు మీదే నిర్మాణ సంస్థను ప్రారంభించి 'పెళ్త్లెన కొత్తలో' చిత్రాన్ని తీశాను. ఇది నిర్మాతగా రెండో చిత్రం. డిసెంబర్ మొదటివారంలో చిత్రీకరణ మొదలవుతుంది. చాలా ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా ఉంటుంది. ఇంకా హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది'' అని తెలిపారు.
రాజమౌళి 'మర్యాద రామన్న'కు కథ అందించి, 'ఈగ'కు స్క్రిప్టు డాక్టర్‌గా పనిచేసిన కాంచి ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేను అందించారు. ఈ చిత్రానికి సమర్పణ: నీలం శంకర్, కథ, స్క్రీన్‌ప్లే: ఎస్.ఎస్.కాంచి, మాటలు: మదన్, సాహిత్యం: చైతన్యప్రసాద్.


Click it and Unblock the Notifications












