twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్లో మరో హిట్ సినిమాకు సీక్వెల్.. సుమంత్ హీరోగా సినిమా ప్రకటన!

    |

    టాలీవుడ్ కి సీక్వెల్స్ అస్సలు కలిసి రావు అని అంటూ ఉంటారు. అది చాలా సినిమాల విషయంలో ప్రూవ్ అయ్యింది కూడా. టాలీవుడ్ లో వచ్చిన అనేక సినిమాల సీక్వెల్స్ అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్స్ గా మిగిలి పోయాయి. ఈక్రమంలో కొన్నాళ్ళు సీక్వెల్ సందడి తగ్గినట్లనిపించినా ఇప్పుడు ఆ ఊపు మళ్ళీ పుంజుకుంది. ఇటీవల కాలంలో సీక్వెల్ హడావుడి కనిపిస్తోంది. ఇటీవల కాలంలో సూపర్ హిట్టయిన కొన్ని చిత్రాలకు సీక్వెల్స్ తెరకెక్కించే ఉత్సాహంలో ఉన్నారు పలువురు దర్శకులు. ఇక అలా ప్రస్తుతానికి హిట్ 2, గూఢాచారి 2, జాతి రత్నాలు 2, కార్తికేయ 2, క్రాక్ 2, జాంబి రెడ్డి 2, పుష్ప 2 వంటి సినిమాలు తెరకేక్కే అవకాశం ఉండగా ఇప్పుడు మరో సీక్వెల్ సినిమా ప్రకటించారు.

    అక్కినేని కుటుంబానికి చెందిన హీరో సుమంత్ ఓ కొత్త సినిమా అంగీకరించారు. "సుబ్రహ్మణ్యపురం", "లక్ష్య" చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో గతంలో విడుదలైన "సుబ్రహ్మణ్యపురం" సినిమా మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు.

    sumanths Subrahmanyapuram sequel announced

    ఈ చిత్రాన్ని కేఆర్ క్రియేషన్స్ పతాకంపై కే ప్రదీప్ నిర్మిస్తున్నారు. హిట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను ఆదివారం ప్రకటించారు. పురాతన దేవాలయం నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆద్యంతం ఆసక్తికరమైన, థ్రిల్ కు గురిచేసే అంశాలతో సినిమాను రూపొందించబోతున్నారట దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తామని చిత్ర నిర్మాత కే ప్రదీప్ వెల్లడించారు. సుమంత్ సినిమాల విషయానికి వస్తే చివరిగా ఆయన మళ్ళీ మొదలైంది అనే సినిమాలో కనిపించరు. ఇక ఆయన హీరోగా నటిస్తున్న అనగనగా ఒక రౌడీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

    English summary
    Subrahmanyapuram director Santhossh Jagarlapudi announced Subrahmanyapuram sequel with Sumanth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X