కేకపుట్టించే విజువల్స్‌తో సుబ్రహ్మణ్యపురం .. డిసెంబర్ 7న రిలీజ్!
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులలో తనదైన ముద్రను వేసుకున్నసెన్సిబుల్ హీరో సుమంత్, ఈషారెబ్బ హీరో హీరోయిన్లుగా, సుధాకర్ ఇంపెక్స్ఐపియల్ బ్యానర్ పై బీరం సుధాకర్ రెడ్డి నిర్మాణంలో నూతన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం. సుబ్రహ్మణ్యపురం. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని యు/ఎసర్టిఫికెట్ తో డిసెంబర్ 7న అత్యధిక థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సైన్స్ కి అందని ఎన్నో రహాస్యాలు మానవమేథస్సుకు సవాళ్ళు విసురుతూనే ఉంటాయి. భగవంతుని మీద నమ్మకం కూడా
అలాంటిదే, ఆ నమ్మకాన్ని ప్రశ్నించే కార్తిక్ పరిశోధనలు ఎలాంటినిజాలను వెలుగులోకి తెచ్చాయి..? కాపాడవల్సిన భగవంతుడి ఆగ్రహంత ట్టుకోవడం సాధ్యం అవుతుందా అనే ప్రశ్నలు కు సమాధానం ఈ నెల 7న ప్రేక్షకులకు దొరకబోతున్నది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది.ఒకరోజులో 1మిలియన్ వ్యూస్ ని సాధించిన సుబ్రమణ్యపురం ట్రైలర్
సినిమా పై అంచనాలను పెంచింది. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ చిత్రయూనిట్ కి అభినందనలు తెలిపింది. థ్రిల్లర్స్ లోసుబ్రహ్మణ్యపురంప్రత్యేక స్థానం సంపాదించుకుంటుదనే చిత్ర యూనిట్ వ్యక్తం చేసింది.
విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే 'సుబ్రహ్మణ్యపురం' ఇండస్ట్రీ లోఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గా మారింది. ఇప్పటికే హిందీ శాటిలైట్, ఓవర్సీస్మార్కెట్ బిజినెస్ లు పూర్తి అయ్యాయి. బాహుబలి, గరుడ వేగ సినిమాలకువిజువల్ ఎఫెక్ట్స్ అందించిన టీం సుబ్రమణ్యపురంకు వర్క్ చేశారు. బాలసుబ్రమణ్యం పాడిన థీమ్ సాంగ్ హైలెట్‌గా నిలుస్తుంది. అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 7న బ్రహ్మండమైన విడుదలకుసిద్దం అవుతన్నసుబ్రహ్మణ్యపురం ప్రేక్షకులకు కొత్త అనుభూతులనుఅందిస్తుందని చిత్ర యూనిట్ పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











