'మా తాత అభిమాన నటుడు మీరే మహేష్'.. హీరో సుమంత్ ట్వీట్!

సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు మహేష్ స్టైల్, నటనని అభిమానిస్తారు. వయసు పెరిగేకొద్దీ మహేష్ అందం పెరుగుతోందే కానీ తగ్గడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 106 ఏళ్ల వయసున్న మృద్ధురాలికి కూడా మహేష్ పై అభిమానం ఉంటే అది ఖచ్చితంగా ఆసక్తికరవార్త అవుతుంది. ఇటీవల మహేష్ బాబు తన అభిమాని అయిన 106 ఏళ్ల వృద్ధురాలిని కలసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై హీరో సుమంత్ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

రాజమండ్రి నుంచి

రేలంగి సత్యవతి అనే 106 ఏళ్ల వృద్ధురాలు రాజమండ్రి వాసి. సూపర్ స్టార్ మహేష్ అంటే పడి చస్తుంది. మహేష్ బాబు నటించిన సినిమాలంటే విపరీతమైన ఆసక్తి చూపుతుంది. గతంలో మహేష్ పై ఈ వృద్ధురాలికి ఉన్న అభిమానం గురించి వార్తలు కూడా ప్రసారం అయ్యాయి. ఎప్పటికైనా మహేష్ ని కలవాలని ఆరాటపడేవారు. రేలంగి సత్యవతి కోరిక ఎట్టకేలకు నిన్న నెరవేరింది. హైదరాబాద్ కు తన కుటుంబ సభ్యులతో వచ్చి మహేష్ ని కలిసింది.

మహేష్ ఆప్యాయంగా

సూపర్ స్టార్ మహేష్ రేలంగి సత్యవతిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. నా అభిమానిగా రేలంగి సత్యవతి గారు ఇంతదూరం వచ్చి నన్ను ఆశీర్వదించారు. నాకు చాలా సంతోషంగా ఉందంటూ మహేష్ ట్వీట్ చేశాడు. ఈ అద్భుత దృశ్యంపై హీరో సుమంత్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

మా తాతకు ఇష్టమైన హీరో

సుమంత్ ట్విట్టర్ వేదికగా.. నీవు ఎప్పుడూ పెద్దవారిపై గౌరవ మర్యాదలు కలిగి ఉంటావు మహేష్. నేటి తరం నటుల్లో మా తాతయ్య ఏఎన్నార్ కు నచ్చిన హీరో మీరే అని సుమంత్ తెలిపాడు. సుమంత్ ట్వీట్ పై మహేష్ స్పందించాడు. థాంక్యూ సుమంత్. నాకు ఎన్నో విషయాల్లో ఏఎన్నార్ గారు ఆదర్శవంతంగా నిలిచారు అని తెలిపాడు.

Recommended Video

Nandamuri Balakrishna Asks Mahesh To NTR Biopic
మహర్షి షూటింగ్

మహర్షి షూటింగ్

ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అంత బిజీలో కూడా మహేష్ తన అభిమాని అయిన వృద్ధురాలు వచ్చిందని తెలిసి ఆమెకోసం సమయం కేటాయించాడు. వంశీ పైడిపల్లి దర్శత్వంలో మహర్షి చిత్రం తెరకెక్కుతోంది. పూజ హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X