twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నందమూరి ఫ్యామిలిలో జూ. ఎన్టీఆర్.. మా కుటుంబంలో నేను.. హీరో సుమంత్!

    |

    హీరో సుమంత్ కేవలం మూడు వారాల వ్యవధిలోనే మరో చిత్రంతో రాబోతున్నాడు. సుమంత్ నటించిన సూపెన్స్ థ్రిల్లర్ చిత్రం సుబ్రహ్మణ్యపురం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమంత్ నటిస్తున్న మరో చిత్రం ఇదంజగత్. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదంజగత్ చిత్రంలో సుమంత్ న్యూస్ రిపోర్టర్ గా నటిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరక్కించారు. సినిమా విడుదల సందర్భంగా సుమంత్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

    ఆత్మవిశ్వాసంతో చేశా

    ఆత్మవిశ్వాసంతో చేశా

    ఇదంజగత్ చిత్రంతో పాటు సుమంత్ ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా నటించారు. సుమంత్ ఏఎన్నార్ పాత్రలో సందడి చేయబోతున్నాడు. ఏఎన్నార్ పాత్రలో నటించగలనని అనుకున్నారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఆత్మవిశ్వాసంతో ఈ పాత్రని చేశా. తాతయ్య పాత్రని విజయవంతగా పోషించగలననే నమ్మకం ఉండేది. మీకు ఏపాత్ర చేయడం సులభం అని బాలయ్యగారిని ఎవరో అడిగితే.. మాతండ్రి ఎన్టీఆర్ పాత్ర అని చెప్పారు. నాకు కూడా అలానే అనిపించింది. మా తాతయ్య పాత్రలో నటించడం నాకు సులభం.

     సినిమాల్లో కాకుండా

    సినిమాల్లో కాకుండా

    ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ కలసి అద్భుతమైన చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ కల్సి నటించిన మాయాబజార్, గుండమ్మ కథ లాంటి చిత్రాలు తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్ గా నిలిచాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమా జీవితం మాత్రమే కాక ఈ చిత్రంలో వీరిద్దరూ ఎంత స్నేహంగా ఉండేవారు అనే విషయాలని కూడా చూపించారని సుమంత్ తెలిపారు. ఆడియో వేడుకలో కూడా సుమంత్ ఇదే విషయాన్ని చెప్పారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ స్నేహానికి నాంది ఎక్కడ పడిందో ఈ చిత్రంలో తెలుస్తుందని వివరించాడు.

    ఇమిటేట్ చేయలేదు

    ఇమిటేట్ చేయలేదు


    తాతయ్య ట్రేడ్ మార్క్ మ్యానరిజమ్స్ చాలా ఉన్నాయి. వాటిని ఈ చిత్రంలో నేను ఇమిటేట్ చేయలేదు. ఏఎన్నార్ గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఈ చిత్రంలో వాటిని చూపిస్తారని అన్నారు. చిన్నప్పటి నుంచి తాతయ్య వద్ద పెరగడం వలన ఆయన ప్రభావం నాపై ఎక్కువగా ఉంది అని సుమంత్ తెలిపాడు.

    నందమూరి ఫ్యామిలిలో ఎన్టీఆర్

    నందమూరి ఫ్యామిలిలో ఎన్టీఆర్


    అందరికి తాతయ్యల పోలికలు రావడం కుదరదు. కొంతమందికే అలా జరుగుతూ ఉంటుంది. నందమూరి కుటుంబలో ఎన్టీఆర్ పోలికలు బాగా వచ్చింది జూ. ఎన్టీఆర్ కి మాత్రమే అని సుమంత్ తెలిపాడు. మా కుటుంబంలో తాతయ్య పోలికలు నాకు ఎక్కువగా వచ్చాయని అందరూ అంటుంటారు. అది నిజమే. పోలికలు మాత్రమే కాదు ఆయన వద్ద పెరగడం వలన కొన్ని అలవాట్లు కూడా వచ్చాయని సుమంత్ తెలిపారు. ఇప్పటికి తాను తాతయ్య ఇంట్లోనే ఉంటున్నానని సుమంత్ తెలిపారు.

    మహానటిలో చైతు

    మహానటిలో చైతు

    మహానటిలో తాతయ్య పాత్రలో నాగ చైతన్య నటించాడు. ఆ సన్నివేశాలు నాకు చాలా బాగా నచ్చాయి. చైతు పోషించింది తాతయ్య యంగ్ గా ఉన్నప్పటి రోల్. ఈ చిత్రంలో యంగ్ గాను, 60 ఏళ్ల వయస్కుడిగాను నటించాలి. బహుశా అందుకే నన్ను ఎంపిక చేసుకున్నారేమో అని సుమంత్ తెలిపాడు. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం జనవరి 9న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.

    మొదట చెప్పింది తాతయ్యతోనే

    మొదట చెప్పింది తాతయ్యతోనే

    తాను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో చదువు మానేస్తానని మొదట చెప్పింది తాతయ్యకే అని సుమంత్ తెలిపారు. పరవాలేదు.. యాక్టింగ్ స్కూల్ లో చేరు అని చెప్పారు. అప్పుడే నటనపై దృష్టి పెట్టాను. అంతకు ముందు మావయ్య నాగార్జున నాతో చెబుతూ.. నీకు సినిమాల్లో నటించాలని ఉంటె ఓకె కానీ అది ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాతే అని అన్నారు. కానీ చదువు మానేస్తున్న విషయాన్ని తాతయ్యతో ధైర్యంగా చెప్పానని సుమంత్ తెలిపాడు.

    English summary
    Sumanth Shares Interesting Facts About NTR Biopic and ANR role. Sumanth interesting comments on Jr NTR
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X