మనసంతా నువ్వే దర్శకుడు 'మాయ'లో స్నేహా ఉల్లాల్
సుమంత్ తో ప్రస్తుతం రాజ్ చిత్రం డైరక్ట్ చేస్తున్న దర్శకుడు వియన్ ఆదిత్య తన తదుపరి చిత్రానికి అతన్నే హీరోగా ఎంపిక చేసుకున్నాడు. స్నేహా ఉల్లాల్ హీరోయిన్ గా చేస్తున్న ఆ చిత్రం టైటిల్ మాయ. ఈ విషయాన్ని స్నేహా ఉల్లాల్ తన ట్విట్టర్ లో రాస్తూ...నేనూ ఈ కొత్త ప్రాజెక్టుతో చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను. అలాగే స్క్రిప్టు విన్నప్పటి నుంచీ నన్ను వెంటాడుతోంది.అలాగే ఈ చిత్రంలో నేనే మాయగా టైటిల్ రోల్ చేస్తున్నాను అంది.ఇక ఈ చిత్రం విషయమై త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది. ప్రియమణి, విమలా రామన్, సుమంత్ కాంబినేషన్ లో వియన్ ఆదిత్య పూర్తి చేసిన రాజ్ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక సుమంత్ తన తాజా చిత్రం గోల్కొండ హైస్కూల్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.కలర్స్ స్వాతి హీరోయిన్ గా చేసిన ఆ చిత్రాన్ని ఇంద్రకంటి మోహన్ కృష్ణ రూపొందించారు. స్నేహా ఉల్లాల్ విషయానికి వస్తే బాలయ్యతో సింహా చేసినా, సుశాంత్ తో కరెంట్ చేసినా ఆమె బిజీ కాలేకపోయింది. ప్రస్తుతం ఆమె తమిళం వేదం వెర్షన్ లో చేస్తోంది. తెలుగులో అలా మొదలైందిలోనూ, కన్నడంలో దేవి అనే చిత్రంలోనూ ఆమె నటిస్తోంది. అలా మొదలైంది చిత్రంలో గెస్ట్ గా కనిపించనుంది.


Click it and Unblock the Notifications











