twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమెకు బిడ్డ కూడా..సుమంత్

    By Staff
    |

    Keerthi Reddy
    కీర్తిరెడ్డికి దూరం కావడం తనలోని మానసిక స్థైర్యాన్ని ఏ మాత్రం నీరుగార్చలేదంటున్నారు సుమంత్. ఈ విషయమై మాట్లాడుతూ 'ఇద్దరం విడిపోయాం. హ్యాపీగానే ఉన్నాం. కీర్తి ఇప్పుడు పెళ్లి చేసుకుంది. ఒక బిడ్డ కూడా. ఆ ఎపిసోడ్ కు తెరపడింది. అయితే ఇప్పటికీ కీర్తి కుటుంబ సభ్యులతో టచ్ లోనే ఉన్నాను. చేదు గాయాలేవీ లేవు. అంతా సుఖాంతమైంది' అంటూ చెప్పుకొచ్చారు. సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా ప్రస్తుతం తనకు లేదనీ, ఆ ప్రభావం తన కెరీర్ మీద కూడా ఎంత మాత్రం ఉండబోదని సుమంత్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం సుమంత్ హీరోగా చేసిన బోణి చిత్రం త్వరలో రిలీజవబోతోంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు.

    'సత్యం' చిత్రం తర్వాత మళ్లీ అంతటి సకెస్స్ ను సాధించలేదని సుమంత్ ఒప్పుకున్నారు. 'అందులో నిజం లేకపోలేదు. అలాగని ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకునే ప్రసక్తి కూడా లేదు. నిజానికి కెరీర్ మొదట్లో ఇబ్బందులు పడ్డాను. సత్యం చిత్రం సాధించిన హిట్ తో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. విమర్శుకులు మరోలా విశ్లేషించి ఉండొచ్చుకానీ నేను నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్లు లేకపోయినా చాలా మటుకు కమర్షియల్ హిట్సే. ఇంతవరకూ కెరీర్ సాగిన తీరుగురించి అడిగితే నిశ్చయంగా నేను సక్సెస్ అయ్యానని చెప్పగలను' అంటూ సుమంత్ ధీమా వ్యక్తం చేశారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X