Don't Miss!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
ఆ దెబ్బకు నా ఫోన్ కూడా పాడైపోయింది: సుమంత్
Recommended Video
శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్ర దారులుగా గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా 'మళ్ళీ రావా'. ఈ చిత్రం డిసెంబర్ 8న బ్యూటీఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ గా నిలిచి విజయపథంలో దూసుకు పోతూ ప్రేక్షాకాదరణ పొందుతున్న తరుణం లో మళ్ళీ రావా చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యం లో హీరో సుమంత్ మాట్లాడుతూ నేనెప్పుడూ సక్సెస్, ఫెయిల్యూర్స్ కు రియాక్ట్ అవ్వను. దేనినైనా బ్యాలెన్సుడ్ గా తీసుకుంటాను. కానీ మళ్ళీ రావా సినిమా చేసినందుకు చాలా తృప్తిగా ఉన్నాను. స్టోరీ బాగా నచ్చింది కనుకే నమ్మాను. ఇప్పుడు ఆ నమ్మకమే ఇంతటి మంచి ఫలితాన్ని అందించింది. గౌతమ్ లాంటి ఒక మంచి రైటర్ ను దర్శకుడిని పరిచయం చేశామని గర్వంగా ఉంది. నిర్మాత రాహుల్ కు ఎలాంటి అనుభవం లేకున్నా సక్సెస్ ను సాధించి చూపించాడు... మా అన్నపూర్ణ స్టూడియో నుంచి నా సిస్టర్ సుప్రియ కాల్ చేసి అప్రిషియేట్ చేసింది... అంతే కాదు ఇండస్ట్రీ నుంచి వస్తున్న అప్రిషియేషన్స్ ఫోన్ చూసి... చూసి... ఫోన్ కూడా పాడు చేశాను. కొత్త ఫోన్ కొనాలిప్పుడు. అందుకు హ్యాపీ గా ఉంది, ఈ సినిమాలో ముఖ్యంగా మ్యూజిక్ హై లెట్ అయ్యింది.. మ్యూజికల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకాదరణ పొందుతున్నందుకు సంతోషిస్తున్నా.. టీమ్ మొత్తానికి కంగ్రాజులేషన్స్ తెలియచేస్తున్నా అన్నారు.