తెలుగు తెర పై ఈ పాత్ర రాలేదు: సుమంత్
ఎస్...! కొత్త రకం పాత్ర చేయబోతున్నాను. ఇప్పటివరకు నేనిలాంటి పాత్ర చేయలేదు. అంతెందుకు..మన తెలుగు తెర మీద ఇలాంటి పాత్ర రాలేదు. అందులో ఏమాత్రం సందేహం లేదు. నా పాత్రలో చక్కని ఎమోషన్స్ ఉన్నాయి అంటున్నారు సుమంత్. ఆయన తాజాగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న కొత్త చిత్రం గురించి మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే కథ గురించి చెప్పను కానీ కచ్చితంగా ఈ చిత్రం మన టాలీవుడ్‌కి కొత్తగా ఉంటుంది. బేసిక్‌గా కొత్త రకం సినిమాలు వచ్చినప్పుడు ఫలానా 'జానర్' సినిమా అంటుంటారు కదా. అలా ఈ సినిమాది ఓ 'జానర్'. తెలుగులో ఇలాంటి కథ రాలేదు అన్నారు. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్న ఈ కొత్త చిత్రంలో సుమంత్ సరసన కలర్స్ స్వాతి హీరోయిన్ గా చేస్తోంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ చిత్రం 'ది మెన్ విత్ ఇన్' అనే పుస్తకం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ పుస్తకాన్ని చిత్రనిర్మాత రామ్మోహన్‌గారి సోదరుడు హరిమోహన్‌గారు రాసారు. ఇక ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా సెంథిల్‌కుమార్, సంగీత దర్శకుడిగా కళ్యాణి మాలిక్ వ్యవహరిస్తున్నారు. ఆర్ట్‌బీట్ క్యాపిటల్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











