Don't Miss!
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
హిట్ కోసం లిప్ టు టిప్ ముద్దులు రహస్యంగా దట్టింటచారా..!
సుమంత్ కథానాయకుడుగా ప్రియమణి, విమలారామన్ కథానాయికలుగా వస్తున్న చిత్రం రాజ్. విఎన్ ఆదిత్య రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానున్నది. కుమార్బ్రదర్స్ పతాకంపై కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమర్షియల్గా అన్ని హంగులు ఉన్నాయి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చిందని నిర్మాతలు తెలిపారు.
అయితే నాగార్జున మేనల్లుడు సుమంత్ ఎంత కొట్టుకుంటున్నా ఒక్క హిట్టూ పడడంలేదు. ఓపక్క తన తర్వాత వచ్చిన నాగ చైతన్య, రాణా వంటి తమ కుటుంబానికే చెందిన వాళ్లు స్పీడుగా వెళ్లిపోతున్నారు. తను మాత్రం అక్కడే వున్నాడు. ఈ నేపథ్యంలో ఏదోలా హిట్ కొట్టాలనుకుంటున్నాడేమో... ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధమైన తన 'రాజ్' సినిమా చాలా స్పైసీగా ఉండేలా చూసుకుంటున్నాడట. గ్లామర్ తారలైన ప్రియమణి, విమలా రామన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. యూత్ ని ఆకట్టుకునేలా వీళ్లని బాగా ఎక్స్ పోజ్ చేశారని చెప్పుకుంటున్నారు. అలాగే, ఇద్దరు హీరోయిన్లతోనూ 'లిప్-లిప్' ముద్దులు కూడా రసరమ్యంగా చిత్రీకరించారని సమాచారం. ఇలా కమర్షియల్ మసాలాను బాగా దట్టించి, ఈ చిత్రాన్ని ఈ నెల 18 న ప్రేక్షకుల మీదకి వదులుతున్నారు. మరి... ఇదైనా సుమంత్ కి సక్సెస్ ఇస్తుందేమో చూద్దాం!