»   » ‘ఆడతోడు’ కోసం సుమంత్ ఆరాటం!??

‘ఆడతోడు’ కోసం సుమంత్ ఆరాటం!??

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో సమంత్ ఆడతోడుకు తహతహ లాడుతున్నాడట. గతంలో కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఆయన ఆ తర్వాత విబేధాలతో విడిపోయాడు. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న సుమంత్ ఆ మధ్య హీరోయిన్ కమిలినీ ముఖర్జీతో ఎఫైర్ కొనసాగించాడనే గుసగుసలు అక్కడక్కడా వినిపించాయి. అప్పట్లో ఆ వార్త సంచలనం సృష్టించడంతో మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదని తేల్చి చెప్పాడు సుమంత్.

ఈ విషయం పక్కన పడితే ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటన బట్టి సమంత్ తోడు కోసం తహతహలాడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య మంచు విష్ణు వైఫ్ వెరానికా ఏర్పాటు చేసిన పార్టీకెళ్లిన మనోడు అక్కడికి వచ్చిన ఓ అందమైన అమ్మాయిని తన చేష్టలతో తెగ ఇబ్బంది పెట్టాడట. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా మనోడు వదలక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండు స్టెప్పులేసిందట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu