ఈ వేసవికి రిలీజు అవుతున్న తెలుగు పెద్ద సినిమాల లిస్ట్
ఈ వేసవి కి తెలుగులో పెద్ద హీరోల చిత్రాలు పోటాపోటీగా విడుదల కానున్నాయి. వీటిల్లో మొదటిగా పవన్ కళ్యాణ్-జయంత్ సి.పరాన్జీ కాంబినేషన్‌లో హాస్య నటుడు గణేష్‌బాబు నిర్మిస్తున్న లవ్ లీ చిత్రాన్ని చెప్పుకోవాలి. ఆ తర్వాత మహేష్‌బాబుతో శ్రీను వైట్ల రూపొందిస్తున్న 'దూకుడు" చిత్రం కూడా ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, ఎన్టీఆర్-మెహర్ రమేష్ కాంబినేషన్‌లో అశ్వినీదత్ నిర్మిస్తున్న 'శక్తి" కూడా సమ్మర్‌కే సందడి చేయనుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..ఈ ముగ్గురు హీరోలు నటించిన 'కొమరం పులి", 'ఖలేజా", 'బృందావనం" చిత్రాలు కూడా గతేడాది నెల్రోజుల వ్యవధిలో విడుదలయ్యాయి. ప్రభాస్-కాజల్ జంటగా నటించిన 'మిస్టర్ పర్‌ఫెక్ట్" కూడా ఈ సమ్మర్ కే వస్తోంది. అలాగే బన్నీ కాంబినేషన్ వివి వినాయక్-అల్లు అర్జున్ కలయికలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న 'బద్రినాధ్" కూడా ఈ వేసవికి వినోదాన్ని పంచేందుకు సన్నద్ధమవుతోంది.అదేవిధంగా, ఇటీవలే 'మిరపకాయ్" చిత్రంతో సూపర్‌హిట్‌ను సొంతం చేసుకున్న రవితేజ నటిస్తున్న 'వీర" కూడా వస్తోంది. 'వీర" చిత్రాన్ని 'రైడ్" ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











