అదీ మహేష్ బాబు కమిట్మెంట్ అంటే!
హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సీటీలో జరుగుతోంది. ఓ వైపు ఎండలు మండి పోతున్నా...ఉదయం 10 గంటలు దాటితే బయటకు వెళ్లలేని తీవ్రమైన వేడి పరిస్థితి ఉన్నా షూటింగ్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు మహేష్ బాబు.
ఎంత ఎండ ఉన్న లెక్కచేయకుండా...యూనిట్ సభ్యులను సైతం ఎంకరేజ్ చేస్తూ మరీ 'ఆగడు' షూటింగును ముందుకు నడిపిస్తున్నాడట. కొందరు హీరోలు ఎండ ఉంటే షూటింగ్ వాయిదా వేయించడాలు గట్రా చేయిస్తుంటారని, మహేష్ బాబు నిర్మాత మరింత భారం పెంచకుండా పని చేస్తున్నాడని యూనిట్ సభ్యులు ప్రశంసిస్తున్నారు.

ఆగడు చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సోనూ సూద్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నెపోలియన్, సాయి కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫ్ కెవి గుహన్ ఈచిత్రానికి పని చేస్తున్నారు. దసరా నాటికి ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు మహేష్ బాబు. మైత్రి మూవీస్ పతాకంపై ఎర్నేని నవీన్, ఎలమంచిలి రవి శంకర్, సివిఎం సంయుర్తంగా ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. జులై నెలలో ఈచిత్రం ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కొరటాల శివ పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు.


Click it and Unblock the Notifications











