ఈ సమ్మర్ కి రిలీజ్ అవుతున్న చిత్రాలివే...
సమ్మర్ స్పెషల్స్‌గా తెలుగు చిత్ర పరిశ్రమ దాదాపు పాతిక చిత్రాల వరకు విడుదలచేయటానికి సన్నాహాలు చేస్తోంది. వీటిలో భారీ తెలుగు చిత్రాలు, లో బడ్జెట్ చిత్రాలు, డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆ సమ్మర్ ని ప్రారంభిస్తూ...గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నిర్మించిన 'వరుడు' చిత్రం విడుదలైంది. ఇక రెండు రోజుల్లో కరుణాకరన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన 'డార్లింగ్' వస్తోంది. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా, నయనతార, నమిత, స్నేహా ఉల్లాల్ హీరోయిన్లుగా నటించే 'సింహా' చిత్రం బోయిపాటి శ్రీను దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మించిన చిత్రం విడుదలవుతుంది.
వెను వెంటనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న 'గోల్‌మార్' వస్తోంది. గోపిచంద్, ప్రియమణి చేసిన ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉంది. వీటితో పాటు వి సముద్ర దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా చంద్ర నిర్మిస్తున్న 'పంచాక్షరి' అంతా కొత్త వారితో దాసరి నారాయణరావు రూపొందిస్తున్న 'యంగ్ ఇండియా' విడుదల కానున్నాయి.
మరో ప్రక్క ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్...పులి వస్తోంది. నిఖిషాపటేల్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని ఎస్ జె సూర్య దర్శకత్వంలో శింగనమల రమేష్‌బాబు నిర్మిస్తున్నారు. అంతకు ముందే అల్లు అర్జున్, క్రిష్ ల కాంబినేషన్లో రెడీ అయిన వేదం వచ్చేస్తోంది. వీటి మధ్యలో దిల్ రాజు నిర్మించే రామ రామ కృష్ణ కృష్ణ కూడా ఏప్రిల్ తర్వాత విడుదల ఏర్పాటు చేస్తున్నారు.
ఇక మీరా జాస్మిన్ మోక్ష, స్నేహగీతం, అందరి బంధువయ, హాసిని, చాప్టర్-6, కలెక్టర్ గారి భార్య, బురిడి చిత్రాలు కూడా సమ్మర్ స్పెషల్స్‌గానే విడుదల అవుతున్నాయి. ఇవికాక సమ్మర్ స్పెషల్‌గా తమిళ, ఇంగ్లీష్ డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదలవుతున్నాయి. ఎన్ని విజయం సాధిస్తాయి అనేది ప్రక్కన పెడితే భారీ ఎత్తునే సినీ జూదం జరగనుంది.


Click it and Unblock the Notifications











