'స్టార్ హీరోలే కాదు టాప్ హీరోయిన్లూ పోటీలో నిలుస్తున్నారు...
ఈ సమ్మర్ కి స్టార్ హీరోలే కాక టాప్ హీరోయిన్లు కూడా నువ్వా, నేనా అన్నట్టు పోటీకి సిద్దమవుతున్నారు. ఏప్రిల్ రిలీజ్ కి రెడీ అవుతున్న 'శక్తి", 'మిస్టర్ ఫర్ ఫెక్ట్", 'తీన్ మార్" చిత్రాలు ముగ్గురు హీరోయిన్లు ఆదిపత్యానికి పరీక్ష కానున్నాయి. ఈ మూడు చిత్రాల్లోను కథానాయికలు ప్రస్తుతం టాప్ 5లిస్ట్ లో ఉన్నవాళ్లే కావడంతో ఏ సినిమా హిట్టయితే సదరు హీరోయిన్ కి మోరల్ విక్టరీ దక్కినట్టవుతుంది.
'శక్తి" చిత్రంలో సోలో హీరోయిన్ రోల్ ఎంజాయ్ చేసిన ఇలియానా ఈ చిత్రంలో మునుపెన్నడూ కనిపించనట్టు ఫాంటసీ టచ్ తో కనిపించనుంది. ఆమె లుక్ కి మంచి రెస్సాన్స్ లభిస్తోంది. ఇక మిస్టర్ ఫర్ ఫెక్ట్ లో ప్రభాస్ సరసన ఓ కథానాయికగా నటించిన కాజల్ కూడా మరో హిట్ కొడతాననే నమ్మకంతో ఉంది.
తీన్ మార్ లో తన ఫేవరెట్ హీరోతో ఫుల్ టైమ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకున్న త్రిష కోల్సోతున్న 'యూత్" ట్యాగ్ మళ్లీ చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరు మిస్ ఫర్ ఫెక్టో, ఎవరికి ఎక్కువ శక్తి ఉందో, ఎవరు తీన్ మార్ ఆడిస్తారో వేచి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











