తెలుగులో భారీ,క్రేజీ ప్రాజెక్టు లుగా హైప్ క్రియేట్ అవుతున్న కంత్రి(మే1 లేదా 9 న),పరుగు(మే 23 న) సినిమాలు రెండూ ఒకే నెలలో రిలీజుకు ప్లాన్ చేయటం అందరిలో చర్చనీయాంసంగా మారింది.'పరుగు' సినిమా..బ్లాక్ బస్టర్ 'బొమ్మరిల్లు' తరువాత భాస్కర్,దిల్ రాజు తో చేస్తున్న సినిమా కావటం,అల్లు అర్జున్ 'దేశముదురు' తర్వాత వస్తున్నది అవటం తో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.ఇక 'కంత్రి' పూరీ శిష్యుడూ,కన్నడంలో మెగా హిట్లు ఇచ్చిన మెహర్ రమేష్ మెదటి సారి తెలుగులో చేస్తున్న చిత్రం.అలాగే జూనియర్ యన్టీఆర్ సన్నబడి మరీ 'యమదొంగగా' వచ్చి కలెక్షన్లు దోచేసిన తర్వాత వస్తున్న సినిమా ఇది.దాంతో ఈ కాంబినేషన్ పై విపరీతమైన హైప్,క్రేజ్ ఏర్పడ్డాయి.దాంతో సమ్మర్ మొత్తం ఈ రెండు సినిమాల హంగామా ఉంటుందని అందరూ ఊహిస్తున్నారు.ఇలా రెండు పెద్ద సినిమాలు ఒకే నెలలో రిలీజవటం సంతోషమే గాని లీజుకు థియోటర్ల సమస్య వస్తుందేమో అని డిస్ట్రిబ్యూటర్లు ఆలోచనలో పడుతున్నారు.