twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సన్ టీవీ (SRH)భారీ విరాళం..ఆటగాళ్లను పీకేసి ఆ డబ్బును కూడా డొనేట్ చేయండి..ముఖ్యంగా ఆ 3D ప్లేయర్‌ను

    |

    కోవిడ్ బాధితులు కోసం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొంతమంది సెలబ్రెటీలు వ్యాపారవేత్తలు భారీ విరాళం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ప్రముఖ సన్ టీవీ కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ కలయికతో కోవిడ్ రిలీజ్ ఫండ్ ను అందించడానికి సిద్ధమైంది. అందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపగా ఒకవైపు మెచ్చుకోవడంతో పాటు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి.

    Recommended Video

    SunRisers Hyderabad Owners Sun TV Donates Rs 30 Crore For COVID-19 Relief Work | Oneindia Telugu
    ఎంత కంట్రోల్ చేసినా కూడా

    ఎంత కంట్రోల్ చేసినా కూడా

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తాకిడి మరింత ఉదృతంగా మారుతున్న విషయం తెలిసిందే. ఎంత కంట్రోల్ చేసినా కూడా కోవిడ్ ఏ మాత్రం ఆగడం లేదు. వైరస్ కూడా మరింత బలంగా మారుతోందనే కథనాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక కొన్ని బడా కంపెనీలు కూడా డోనేషన్స్ అందిస్తున్నాయి. ఇక సన్ టీవీ కూడా తనవంతు సహాయం అందించింది.

    30కోట్ల విరాళం

    30కోట్ల విరాళం

    టెలివిజన్ రంగంలో సన్ టీవీ ఛానెల్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో అందరికి తెలిసిందే. అంతే కాకుండా ఆ ఛానెల్ నుంచి వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా మంచి గుర్తింపు అందుకుంది. ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు ఓనర్స్ గా ఉన్నటువంటి సన్ టీవీ కోవిడ్ బాధితుల కోసం 30కోట్ల రూపాయల విరాళాలాన్ని అందించింది.

    ఆ ప్లేయర్స్ ను పీకేసి..

    ఆ ప్లేయర్స్ ను పీకేసి..

    అంతేకాకుండా అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లతో పాటు వెంటిలేటర్ బెడ్స్ వంటి సహాయలను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటె నెటిజన్ల నుంచి వస్తున్న అభిప్రాయం విభిన్నంగా ఉంది. సన్ రైజర్స్ ఇటీవల ఐపీఎల్ లో చెత్త పెర్ఫామెన్స్ తో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అందులో మిడిలార్డర్ ఆటగాళ్లను మొత్తం పీకేసి వాళ్ళ కోసం ఖర్చు చేసి ఆ డబ్బేదో కోవిడ్ బాధితులని ఇవ్వాలని అంటున్నారు.

    విజయ్ శంకర్ ను కూడా

    విజయ్ శంకర్ ను కూడా

    ముఖ్యంగా సన్ రైజర్స్ టీమ్ బిల్డప్ ఎక్కువ ఆట తక్కువ అనే కామెంట్స్ అందుకున్న 3D ప్లేయర్ విజయ్ శంకర్ ను కూడా తీసేసి ఆ డబ్బును కోవిడ్ రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. ఇక లీగ్ టేబుల్లో సన్ రైజర్స్ కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే అందుకొని ఆఖరి స్థానంలో నిలిచింది.

    English summary
    Sun TV (SunRisers Hyderabad) is donating Rs.30 crores to provide relief to those affected by the second wave of the Covid-19 pandemic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X