ఫిక్సింగ్ ద్వారా పాపులారిటీ.. 'ఎవరీ నుపుర్ మోహతా'..?
గతయేడాది ఇండియా - పాకిస్దాన్ సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందంటూ ఢిల్లీకి చెందిన ఓ బుకీ విచారణ సందర్భంగా పేర్కొన్నాడని సండై టైమ్స్ పత్రిక ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి మన అందరికి తెలిసిందే. అంతేకాకుండా క్రికెట్ మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు గాను బుకీలు బాలీవుడ్ హీరోయిన్లను ఎరగా చూపిస్తారని సండే టైమ్స్ తెలపడమే కాకుండా ఈ కథనానికి ఓ బాలీవుడ్ హీరోయిన్ నుపుర్ మెహతా ఇమేజిని ప్రచురించడం జరిగింది.
ఇంతకాలం వార్తల్లో అంత ప్రాముఖ్యం లేకుండా ఒక్కసారిగా బాలీవుడ్‌లో పాపులారిటీని అందుకున్న ఈ నుపుర్ మెహతా ఎవరు..? నుపుర్ మెహతా ఇండియన్ బాలీవుడ్ హీరోయిన్. బాలీవుడ్‌లో 'జో బోలే సో నిహాల్(2005) సినిమా ద్వారా రంగ ప్రవేశం చేశారు. వీటితో పాటు ఫాంటా, పైరెల్లీ లాంటి టివి ఎడ్వర్టైజ్‌మెంట్ లలో పాల్గోన్నారు. నుపుర్ మెహతా ఫియట్ క్యాలెండర్ గర్ల్‌గా అందరికి సుపరిచితం. ఇక్కడ పాఠకులు గమనించాల్సిన విషయం ఏమిటంటే నిన్నటి వరకూ వీకిపీడియాలో ఎటువంటి పేజి లేని నుపుర్ మెహతా ఫిక్సింగ్ ద్వారా వార్తల్లోకి రావడంతో వీకీపిడియా ప్రత్యేక పేజిని కల్పించింది.
జూన్ 2001వ సంవత్సరంలో విడుదలైన అంతర్జాతీయ క్రీడా పత్రిక కవర్ పేజిపై దర్శనమిచ్చింది. గతయేడాది ఆస్తా ఆత్రై రచించిన ఇండియా మొదటి మిల్స్ అండ్ బూన్స్ కవర్ పేజిపై దర్శమిచ్చింది. సండే టైమ్స్ తన ఇమేజిని ప్రచురించిన సందర్బంలో నుపుర్ మెహతా మాట్లాడుతూ ఆటగాళ్లతో నాకు సంబంధాలున్నాయనే వార్తలను ఖండించింది. క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌తో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ పత్రికలో వచ్చిన ఫొటో 'జో బోలే సో నిహాల్(2005) సినిమాలో నేను నటించినప్పటిది. వారు నా పేరును ప్రచురించకపోయినా సండే టైమ్స్‌పై కోర్టుకెళతా' అని నుపుర్ తెలిపింది.


Click it and Unblock the Notifications