Don't Miss!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరో టాలెంటెడ్ దర్శకుడితో సందీప్ కిషన్ న్యూ మూవీ
సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా స్పీడ్ గా సినిమాలు చేసే అతికొద్ది మంది యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. మనోడు ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమమ్ ఉండాలి అనేలా ప్లాన్ చేసుకుంటాడు. అయితే సినిమాలు ఎంత హడావుడిగా రిలీజ్ చేసినా కూడా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వడం లేదు. అందుకే అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాలు చేస్తూ జనాల దృష్టిని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు.
అభిమానులకు ఎంత దగ్గరైతే అంత మంచిది అనేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక కోవిడ్ కష్ట సమయంలో తనకు వీలైనంత వరకు సహాయం కూడా చేస్తున్నాడు. అసలు మ్యాటర్ లోకి వెళితే ఇటీవల సందీప్ కిషన్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చాడు. టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా?, ఒక్క క్షణం, డిస్కో రాజా వంటి విభిన్నమన సినిమాలను తెరకెక్కించిన విఐ.ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు పుట్టినరోజు సందర్భంగా వివరణ ఇచ్చారు.
సందీప్ కిషన్ 28వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా సూపర్ న్యాచురల్ ఫాంటసీ కథగా తెరకెక్కనుందట. స్క్రిప్ట్ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తరువాతే సందీప్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఈ డైరెక్టర్ హీరో కాంబినేషన్ లో టైగర్ అనే సినిమా వచ్చింది. ఇక మళ్ళీ ఇన్నాళ్లకు సందీప్ తనకు ఇష్టమైన దర్శకుడితో వర్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.