ఆ హీరోయిన్‌తో సందీప్ కిషన్ డేటింగ్: క్లోజ్‌గా ఉన్న ఫొటో లీక్.. మా సిస్టర్ ఇంట్లోనే ఉంటుందని క్లారిటీ
అదిరిపోయే టాలెంట్ ఉన్నా.. ఆశించిన రీతిలో విజయాలను సొంతం చేసుకోలేకపోతోన్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తోన్న అతడు.. సక్సెస్‌లను మాత్రం సాధించలేకపోతోన్నాడు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. కెరీర్ పరంగా ఇలా సాగిపోతోన్న సందీప్ కిషన్ కొంత కాలంగా ఓ హీరోయిన్‌గా డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అతడికి మరోసారి దీని గురించి ప్రశ్న ఎదురైంది. దీంతో ఈ వ్యవహారంపై సందీప్ కిషన్ స్పందించాడు. ఆ సంగతులు మీకోసం!

మైఖేల్ అని వచ్చిన సందీప్
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రమే 'మైఖేల్'. రంజిత్ జయకోడి తెరకెక్కించిన ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించగా.. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్‌కుమార్, అనసూయ, వరుణ్ సందేశ్ తదితరులు నటించారు. ఈ క్రేజీ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, కరణ్ సీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై భరత్ చౌదరి, పుష్కర్ రామ్ మోహన్ సంయుక్తంగా నిర్మించారు.

అలాంటి టాక్... రెస్పాన్స్‌తో
మొదట్లోనే భారీ అంచనాలను ఏర్పరచుకున్న సందీప్ కిషన్ 'మైఖేల్' మూవీ ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అందుకు అనుగుణంగానే దీనికి మంచి టాక్ వచ్చింది. అయితే, ఈ సినిమాకు స్పందన మాత్రం ఆశించిన రీతిలో రాలేదు. ఫలితంగా ఈ చిత్రానికి వసూళ్లు కూడా అనుకున్నట్లుగా రాలేదు. అయితే, ఈ వీకెండ్‌లో రెస్పాన్స్ పెరిగే ఛాన్స్ ఉంది.

రెజీనాతో సందీప్ లవ్ ట్రాక్
హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న సందీప్ కిషన్.. చాలా కాలంగా యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రాతో లవ్ ట్రాక్ నడుపుతున్నాడని ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరూ ఇప్పటి వరకూ నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. పైగా ఎంతో క్లోజ్‌గా ఉంటున్నారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అవుతోంది.

ఐలవ్యూ అని.. క్లోజ్‌గా ఫొటో
రెజీనా, సందీప్ మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. దీంతో ఇద్దరూ తరచూ కలుస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల రెజీనా కసాండ్రా పుట్టినరోజు సందర్భంగా సందీప్ కిషన్.. 'హ్యాపీ బర్త్డే పాప.. ఐ లవ్ యూ.. నీకు ఎప్పుడూ మంచే జరగాలి' అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, రెజీనాతో ఎంతో క్లోజ్‌గా ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు. దీంతో వీళ్ల న్యూస్ మళ్లీ హైలైట్ అయింది.

ఆ ఫొటోనే చూపించి ప్రశ్న
తాజాగా సందీప్ కిషన్ 'మైఖేల్' మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జరిగిన చిట్ చాట్‌లో యాంకర్ గతంలో అతడు రెజీనాతో కలిసి దిగిన ఫొటోను చూపించి.. దీని గురించి స్పందించమని సందీప్‌ను కోరింది. దీంతో అతడు 'ఈ ఫొటోలు తమిళ మీడియా వాళ్లు వేశారు. ఎందుకంటే మా గురించి వాళ్లకు ఏమీ తెలియదు కాబట్టి.. అంతే' అంటూ చెప్పుకొచ్చాడు.

మా గురించి తెలుసు కదా
ఆ తర్వాత సందీప్ మాట్లాడుతూ.. 'ఇలాంటి ఫొటోలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మేము 12 సంవత్సరాల నుంచి కలిసి పని చేస్తున్నాం. మేము 4 సినిమాలు చేశాం. మేము బెస్ట్ ఫ్రెండ్స్. మా ఫ్యామిలీలు కూడా చాలా క్లోజ్‌గా ఉంటాయి. రెజీనా ముంబై వెళ్లినప్పుడు మా సిస్టర్ వాళ్ల ఇంట్లోనే స్టే చేస్తుంది. అంతలా మా మధ్య ఫ్రెండ్‌షిప్ ఉంది' అంటూ వివరణ ఇచ్చాడు.

వాళ్లకు కొత్త.. ఇక్కడ పాతే
సందీప్ కంటిన్యూ చేస్తూ.. 'మన వాళ్లకు మా ఇద్దరి గురించి తెలుసు. అందుకే మా గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇక్కడ మా గురించి రాసినా ఏమీ ఉండదు. కానీ, చెన్నై మీడియా మా గురించి సర్‌ప్రైజ్ అయిపోయి ఇలాంటివి రాశారు. మొన్న అక్కడ ఇదే అడిగితే ఇదే చెప్పా. మీకు కొత్త మా వాళ్లు (తెలుగు మీడియా) మమ్మల్ని పట్టించుకోదు అన్నా' అని క్లారిటీ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











