సందీప్ కిషన్ సరికొత్త ప్లాన్.. ఆ వ్యాపారం లోకి ఎంటర్
రోజురోజుకూ యువ హీరోల తీరు మారుతూ వస్తోంది. కేవలం సినిమాలే గాక సొంతంగా వ్యాపారం చేయడానికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు యంగ్ హీరోస్. ఈ మేరకు మహేష్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ ఇప్పటికే వ్యాపార రంగంలో అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు కూడా. తాజాగా వారి బాటలోనే సందీప్ కిషన్ వెళ్తున్నాడు.
సరికొత్తగా ఆలోచిస్తూ వ్యాపార విస్తరణ దిశగా అడుగులేస్తున్నాడు సందీప్ కిషన్. ఈ ఏడాది హీరోగా, నిర్మాతగా మంచి విజయాలు అందుకున్నాడు సందీప్ కిషన్. 'నిను వీడని నీడను నేనే' సినిమాతో ఆయన నిర్మాతగా మారిన ఈ యంగ్ హీరో.. ఇటీవలే 'తెనాలి రామకృష్ణ'తో కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

హీరోగా, నిర్మాతగానే కాక సందీప్ కిషన్ వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నాడు. ఇప్పటికే జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ లో 'వివాహ భోజనంబు' పేరుతో ఆయనకు పలు రెస్టారెంట్లు ఉన్నాయి. విజయవంతంగా రెస్టారెంట్ నిర్వహిస్తున్న సందీప్.. కొత్తగా మరో వ్యాపారంలోకి ఎంటర్ అయ్యాడు.
స్టైలిష్ రంగంలో పేరొందిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ కిషన్ తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో ఈ సెలూన్ ఫ్రాంచైజీని ప్రారంభించనున్నాడు. సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ సందీప్ వేస్తున్న అడుగులు చూసి వావ్ అనేస్తున్నారు ఆయన అభిమానులు. సందీప్ కిషన్ ప్రస్తుతం 'ఏ1 ఎక్స్‌ప్రెస్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హాకీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.


Click it and Unblock the Notifications











