భూకంపం నుంచి తప్పించుకున్నాడు..సేఫ్

By Srikanya

హైదరాబాద్ :ఉత్తర అండమాన్ దీవుల్లోని తీరప్రాంతంలో మంగళవారం స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. అదే సమయానికి అక్కడ షూటింగ్ నిమిత్తం వెళ్లిన సందీప్ కిషన్ అతని టీమ్ అక్కడినుంచి బయిలుదేరిన వెంటనే ఈ భూకంపం వచ్చింది. దాంతో లక్కీగా దాని నుంచి తప్పించుకున్నామని, ఏ విధమైన డామేజీ జరగలేదని అన్నారు. తన కొత్త చిత్రం నిమిత్తం గత నాలుగు రోజులుగా సందీప్ కిషన్ అక్కడే ఉన్నారు. ఆ ప్లేసు అచ్చం..గోవా లా ఉందని అన్నారు.

ఇక రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో ఈ ప్రకంపనలు సంభవించాయి. అయితే దీనివల్ల సునామీ ముప్పు లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. మధ్యాహ్నం 12.37 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించిందని, దీని కేంద్రం అండమాన్ తీరప్రాంతానికి 35 కిలోమీటర్ల దూరంలో సముద్రం అంతర్భాగంలో ఉందని వాతావరణ శాఖ డీజీ ఎల్‌ఎస్ రాథోడ్ తెలిపారు. హిందూ మహా సముద్రం, అండమాన్ సముద్రంలో తరచూ భూకంపాలు చోటుచేసుకుంటాయి. ప్రస్తుతం సందీప్ కిషన్... కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు.

Sundeep Kishan escapes from an earthquake

తన కెరీర్ గురించి సందీప్ కిషన్ మాట్లాడుతూ... నటుణ్ణి కాకముందు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేశాను. అలా అని ఇప్పుడు డైరెక్షన్ మీద ఎలాంటి ఆసక్తీ లేదు. కానీ ప్రొడక్షన్‌లోకి వస్తా. ఎందుకంటే సినిమాకి మించి నాకేమీ తెలీదు. అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించాలని ఉంది. బన్ని (అల్లు అర్జున్) చేసే పాత్రలు నాకు ఇష్టం. 'ఆర్య', 'జులాయి', 'జగడం' అన్నారు.

రెమ్యునేషన్ గురించి మాట్లాడుతూ... ''పారితోషికానికి నేను ఎప్పుడూ ప్రాధాన్యమివ్వలేదు. మంచి సినిమాలో భాగమైతే చాలనుకొన్నా. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలకి తప్ప ఇదివరకు చేసిన ఏ సినిమాకీ పారితోషికం తీసుకోలేదు. నచ్చిన సినిమా చేయాలనుకొన్నప్పుడు డబ్బుల గురించి పట్టించుకోకూడదనేది నా సిద్ధాంతం. అందుకు అనుగుణంగానే ప్రయాణం చేశాను. ఇక నుంచి నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్లడమే నా ముందున్న లక్ష్యం. ఇదివరకు హిందీ, తమిళంలో సరదాగా నటించాను. మళ్లీ అక్కడ సినిమా చేయాలంటే ముందు తెలుగులో మరొక విజయాన్ని అందుకోవాలి''. అన్నారు.

తన తాజా ప్రాజెక్టుల గురించి చెప్తూ... ''చేసే ప్రతీ సినిమా కూడా కొత్తదనాన్ని పంచాలనుకొంటాను. ఓ ప్రేక్షకుడిగానే కథని విని ఎంపిక చేసుకొంటుంటాను. 'గుండెల్లో గోదారి' దర్శకుడు కుమార్‌ నాగేంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. అది కూడా చివరి దశకు చేరుకొంది. ఇదివరకు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసేవాణ్ని. తదుపరి అవకాశం ఉంటుందో లేదో అని భయపడుతూ అలా ఒప్పుకొనేవాణ్ని. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఒక సినిమా తర్వాతే మరొకటి చేయాలని నిర్ణయించుకొన్నా. అప్పుడే పాత్రల్లో వైవిధ్యం చూపించడానికి వీలవుతుంది'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X