సందీప్ కిషన్ అకౌంట్ నుంచి అమ్మాయిలకు అసభ్య సందేశాలు..సైబర్ మోసం

Recommended Video

Sundeep Kishan Reacts On Fake Facebook Accounts Created On His Name || Filmibeat Telugu

రోజురోజుకూ టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతూనే సరికొత్త సైబర్ నేరాలకు తెరలేపుతోంది. వయసు బేధం లేకుండా సోషల్ మీడియాను ఫుల్లుగా వాడేస్తున్నారు జనం. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రతీ ఒక్కరూ అకౌంట్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకున్న కొందరు సైబర్ నేరగాళ్లు హీరో సందీప్ కిషన్ పేరుతో అమ్మాయిలకు వల్గర్ మెసేజీలు పెడుతున్నారు. ఈ విషయం తెలిసి షాకైన సందీప్ కిషన్.. అలాంటి వారిపై ఫైర్ అయ్యాడు. వివరాల్లోకి పోతే..

సందీప్ కిషన్ పేర ఫేస్‌బుక్ అకౌంట్

సందీప్ కిషన్ పేర ఫేస్‌బుక్ అకౌంట్

పాపులర్ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ లో ఎవ్వరి పేరుతో అయినా అకౌంట్ ఓపెన్ చేసుకునే వీలుంటుంది. ఇదే ఆసరాగా చేసుకున్న కొంతమంది ఆకతాయిలు హీరో సందీప్ కిషన్ పేర ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు. దాని ద్వారా అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెడుతూ అసభ్యకర మెసేజీలు పోస్ట్ చేస్తున్నారు. ఇది సందీప్ కిషన్ దృష్టికి రావడంతో వెంటనే ఆయన స్పందించాడు.

అమ్మాయిలకు అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నారు

తన పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి అమ్మాయిలకు అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నారని, అది తన అఫిషియల్ అకౌంట్ కాదని పేర్కొన్నాడు సందీప్ కిషన్. ఈ మేరకు అలాంటి మెసేజీలు పెడుతున్న వారిపై ఫైర్ అవుతూ ట్వీట్ పెట్టాడు. సదరు ఫేక్ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లకు ఆయన సూచించారు.

ఫేక్ ఖాతాల పట్ల జాగ్రత్త

ఫేక్ ఖాతాల పట్ల జాగ్రత్త

నాకు కొంతమంది స్నేహితులు ఫోన్ చేసి నుంచి నా ఫేక్ ఫేస్ బుక్ ఖాతా గురించి చెప్పారు. కొందరు ఆకతాయిలు నా ఫొటోని వాడుకొని ఫేస్‌బుక్‌లో నీకిలీ అకౌంట్ క్రియేట్ చేశారు. దీని ద్వారా ఆడవాళ్లకు అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నారు. వెరిఫైడ్‌ అకౌంట్‌ నుంచి కాకుండా నా ఫొటోలు ఉన్న మరే ఖాతాల నుంచి వచ్చే మెసేజీలకు స్పందించకండి. సోషల్ మీడియాలో ఫేక్ ఖాతాల పట్ల జాగ్రత్తగా ఉండండి అని పేర్కొన్నాడు సందీప్ కిషన్.

నిను వీడని నీడను నేనే

నిను వీడని నీడను నేనే

సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న తాజా సినిమా నిను వీడని నీడను నేనే. కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. జూలై 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X