బాలీవుడ్ హీరో పేరే... మా తెలుగు సినిమా టైటిల్

By Srikanya

హైదరాబాద్: సందీప్‌ కిషన్‌ నటించిన ‘టైగర్‌' చిత్ర టీజర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. వారణాసి నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్‌ అందర్ని ఆకట్టుకుంది. మురుగదాస్‌ శిష్యుడు ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఛోటా.కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా ఎస్‌.ఎస్‌.తమన్‌ మ్యూజిక్‌ అందించారు. అలాగే ఈ చిత్రానికి టైగర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో...ప్రేరణ ఏంటో సందీప్ కిషన్ వివరించారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ.... 'టైగర్ షాఫ్ర్ అనే పేరు పదే పేదే వినటం వల్ల, నేను నా టీమ్ ఈ చిత్రానికి టైగర్ అనే టైటిల్ పెట్టాలనిపించింది. అంతేతప్ప వేరే ఆలోచన లేదు ', అన్నారు. టైగర్ షాఫ్ర్.. జాకీ షరాఫ్ కుమారుడు, హీరో పంతి సినిమాతో హిందీకి పరిచయమయ్యారు. హీరో పంతి చిత్రం ..తెలుగు పరుగు రీమేక్.

సందీప్‌ కిషన్‌ సరసన ‘రన్‌రాజారన్‌' ఫేం శీరత్‌కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఠాగూర్‌ మధు, మెగాసూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఎన్వీ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాహుల్‌ రవీంద్రన్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం సందీప్‌ కిషన్‌ ‘బీరువా' చిత్రం విడుదల సిద్ధమయింది.

దర్శకుడు మాట్లాడుతూ ''కాశీ నేపథ్యంలో సాగే కథ ఇది. థ్రిల్‌కు గురిచేసే యాక్షన్‌ సన్నివేశాలతో పాటు వినోదానికీ ప్రాధాన్యముంద''న్నారు. నిర్మాతలు చెబుతూ ''సందీప్‌కిషన్‌లోని హీరోని మరో స్థాయికి తీసుకెళ్లే కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపుదిద్దుకొంటోంది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ శిష్యుడైన ఆనంద్‌ చిత్రాన్ని చాలా బాగా తీస్తున్నాడు. కాశీ, అలహాబాద్‌, బొబ్బిలి తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నాం. దాదాపుగా సినిమా పూర్తయింది. ఈ నెల 14న 'ఐ'తో పాటు టీజర్‌ను థియేటర్లలో ప్రదర్శిస్తాము''అన్నారు.

Sundeep Kishan Got It From Bollywood Hero

ఇద్దరు అగ్ర నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో సీరత్ కపూర్ హీరోయిన్. గంగ పాత్రలో నటిస్తుంది. సప్తగిరి, సుప్రీత్, తనికెళ్ల భరణి, పృథ్వీరాజ్, ప్రవీణ్, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. గంగానది నేపథ్యంలో విభిన్న కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది.

కాశీలో ఈ సినిమా ముఖ్య సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు, సంగీత దర్శకుడు తమన్, మాటల రచయిత అబ్బూరి రవి వంటి టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. మరో ప్రక్క సందీప్ కిషన్...బీరువా చిత్రం విడుదల కు రెడీ అవుతోంది.

రాహుల్‌ రవీంద్రన్‌, సప్తగిరి, సుప్రీత్‌, తనికెళ్ల భరణి, పృథ్వీరాజ్‌, ప్రవీణ్‌, కాశీ విశ్వనాథ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సంగీతం: తమన్‌, మాటలు: అబ్బూరి రవి

‘బీరువా' విశేషాలకి వస్తే...

సందీప్‌ కిషన్‌, సురభి జంటగా కణ్మణి దర్శకత్వంలో ఉషాకిరణ్‌ మూవీస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బీరువా'. రామోజీరావు నిర్మాత. ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరాలందించారు.

హీరో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘‘ఉషాకిరణ్‌ మూవీస్‌ లాంటి పెద్ద సంస్థలో సినిమా చెయ్యడం నా అదృష్టం. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో జెమిని కిరణ్‌గారు నన్ను మరో మెట్టెక్కించారు. ఇందులో నా పాతర వైవిధ్యంగా ఉంటుంది. నటనలో నా పరిధిని పెంచే సినిమా ఇది. కుటుంబం మొత్తం చూసేలా దర్శకుడు మలిచారు. తమన్‌ చక్కని స్వరాలందించారు. ప్యూచర్‌లో ఆయనతో మరిన్ని సినిమాలు చెయ్యబోతున్నా'' అని అన్నారు.

దర్శకుడు కణ్మణి మాట్లాడుతూ ‘‘ఎప్పటి నుంచో ఉషాకిరణ్‌ సంస్థలో సినిమా చెయ్యాలని ప్రయత్నిస్తున్నా. ‘బీరువా'తో కుదిరింది. నా తొలి సినిమాలాగా భావించి తెరకెక్కించాను. కమర్షియల్‌ హంగులతో వినోదాత్మకంగా సాగుతుంది. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇది'' అని తెలిపారు.

‘‘కణ్మణి ఎంతో క్లారిటీతో ఈ సినిమా తెరకెక్కించారు. కథానుగుణంగా చక్కని పాటలు రాబట్టుకున్నారు. సందీప్‌ కెరీర్‌ని మలుపు తిప్పే చిత్రమిది'' అని ఎస్‌.ఎస్‌.తమన్‌ అన్నారు. ‘‘తెలుగులో తొలి సినిమా ఇది. నాయికగా గుర్తింపు తెచ్చే పాత్ర చేశాను'' అని సురభి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X