అభిమాని మృతి: కుటుంబ సభ్యులకు సందీప్ కిషన్ పరామర్శ

ఇటీవల తనను అమితంగా ఇష్టపడే అభిమాని మరణించడం యువ క‌థానాయ‌కుడు సందీప్‌కిష‌న్‌కు విషాదాన్ని మిగిల్చింది. తన తొలి చిత్రం ప్ర‌స్థానం నుంచి అభిమానిగా మారిన క‌డ‌ప శ్రీను శుక్రవారం జనవరి 18న ప్రొద్దుటూరులో గుండెపోటుతో క‌న్నుమూసిన సంగతి తెలిసిందే. అభిమాని మృతి కలత చెందిన సందీప్ కిషన్ ఇటీవల మృతుని కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. కడప శ్రీను కుటుంబానికి ప్రతీ నెల రూ.7వేలను ఇస్తానని ప్రకటించారు కూడా.

 Sundeep Kishan met and consoled His fan Srinu family

తీరని శోకంలో మునిగిన కడప శ్రీను కుటుంబాన్ని ఇటీవల కలిసి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఆర్థిక అండతోపాటు పిల్లల చదువుకు అయ్యే ఖర్చు కూడా భరిస్తానని మాట ఇచ్చినట్టు తెలిసిందే.

 Sundeep Kishan met and consoled His fan Srinu family

తన అభిమాని మరణంతో ఇబ్బందుల్లో పడిన కుటుంబాన్ని ఆదుకోవడానికి సందీప్ కిషన్ ముందుకు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. అభిమానులను పట్టించుకోని హీరోలు ఉన్న ఈ రోజుల్లో సందీప్ కిషన్ స్పందించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X