సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభం

నిర్మాత మాట్లాడుతూ ''వినూత్నమైన ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. 'రొటీన్ లవ్‌స్టోరీ' చిత్రంతో సందీప్, రెజీనా జంట అందరినీ ఆకట్టుకొంది. మరోసారి ఈ జోడీతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. దర్శకుడు కృష్ణవంశీ దగ్గర పనిచేసిన మహేష్ తయారు చేసిన ఈ కథ చాలా బాగుంది'' అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అర్జున్ చెల్లూరి.
మరో ప్రక్క సందీప్‌కిషన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న చిత్రం 'డీకే బోస్'. నిషా అగర్వాల్ హీరోయిన్. ఎన్.బోస్ దర్శకుడు. ర్యాండమ్ థాట్స్ పతాకంపై శేషు రెడ్డి, ఆనంద్ రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కథ గురించి దర్శకుడు మీడియాకు వివరించారు.
దర్శకుడు ఎన్.బోస్ మాటల్లో... 'ఆ పోలీస్‌ఆఫీసర్ డబ్బు కోసం ఎలాంటి పనినైనా చేయడానికి సిద్ధపడతాడు. తాను పోలీస్‌ఆఫీసర్‌గా గోల్డ్‌మెడల్స్ అందుకోవాలని రాలేదు. గోల్డ్ బిస్కెట్స్ సంపాందించడానికి వచ్చాను అనుకునే తత్వం అతనిది. అలాంటి ఆ యువ పోలీస్ ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. అప్పుడు అతనిలో వచ్చిన మార్పేమిటి? అనేది చిత్ర కథ అన్నారు.
నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ' ఇదొక వైవిధ్యమైన ప్రేమకథ. సందీప్ పాత్ర కొత్తగా వుంటుంది. అచ్చు సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలను ఇటీవలే విడుదల చేశాం. వాటికి చక్కని స్పందన వస్తోంది' అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: వెంకట రామరాజు, నజీర్. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డికె బోస్ చిత్రంలో సంపత్ కుమార్, అన్నపూర్ణమ్మ, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, అజయ్ కుమార్, మల్లాది, సత్తెన్న, రవి వర్మ తదితరులు నటిస్తున్నారు. అచ్చు సంగీతాన్ని అందించారు. విశ్వేశ్వర్ ఎస్వీ కెమెరాకు పని కల్పించారు. స్క్రిప్టు ఎన్ బోస్ రాసుకున్నారు.


Click it and Unblock the Notifications











