తమన్నా తర్వాత హన్సిక.. యువ హీరో రొమాంటిక్ జోరు!
Recommended Video

యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ లో విజయాల శాతం తక్కువే. కానీ అవకాశాలు మాత్రం మెండుగా వస్తున్నాయి. ఇటీవల సందీప్ కిషన్ నటించిన చిత్రాలని నిరాశపరుస్తూ వచ్చాయి. ఈ యువహీరోకీ అర్జెంటుగా ఓ హిట్టు అవసరం. సందీప్ కిషన్, తమన్నా జంటగా నటించిన నెక్స్ట్ ఏంటి చిత్రం డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. సినిమాల విషయంలో సందీప్ కిషన్ దూకుడు పెంచినట్లు కనిపిస్తున్నాడు. నెక్స్ట్ ఏంటి విడుదల కాకముందే మరో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్
తాజాగా సందీప్ కిషన్ తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. సందీప్ నెక్స్ట్ మూవీకి తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ అనే టైటిల్ ఖరారు చేశారు. వినోదాత్మక అంశాలతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని జి నాగేశ్వర రెడ్డి తెరకెక్కించబోతున్నారు. నేడు దర్శకుడు నాగేశ్వర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు.

హాట్ బ్యూటీస్‌తో రొమాన్స్
సందీప్ కిషన్ వరుసగా క్రేజీ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏంటి చిత్రంలో తమన్నాతో ఆడిపాడిన సందీప్ ఈ సారి ఆపిల్ పిల్ల హన్సికతో చిందేయబోతున్నాడు. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ చిత్రానికి హన్సికని హీరోయిన్ గా ఎంపిక చేశారు. హన్సిక తెలుగు తెరపై మెరిసి చాలా రోజులవుతోంది. గౌతమ్ నంద చిత్రంలో నటించిన తరువాత హన్సిక మరో తెలుగు ఒకే చేయలేదు. ఇప్పుడు సందీప్ కిషన్ సరసన నటిస్తుండడంతో ఆసక్తి నెలకొంది.

డిసెంబర్ 14న ప్రారంభం
డిసెంబర్ 14న ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారు. అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మురళి శర్మ, వెన్నెల కిషోర్, పృథ్వి క్యారెక్టర్ రోల్స్ లో నటించనున్నారు. సందీప్ కిషన్ ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నటిస్తున్నాడు. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నాగిరెడ్డి, సజీవ రెడ్డి నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్
వరుసగా చిత్రాలు నిరాశపరచడంతో సందీప్ కిషన్ ఇకపై రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రాలపై దృష్టి పెట్టాడు, నెక్స్ట్ ఏంటి చిత్రంలో తమన్నా గ్లామర్ ప్లస్ కానుంది. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ చిత్రంలో హన్సిక ప్రధాన ఆకర్షణగా మారడం ఖాయం. హన్సికకు కుర్రకారులో విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ హన్సిక ఇటీవల ఎక్కువగా తమిళ చిత్రాలపైనే ఫోకస్ పెట్టింది.


Click it and Unblock the Notifications











