యంగ్ హీరో సందీప్ కిషన్ సొంత బేనర్ పెట్టేశాడు!

ఈ మధ్య కాలంలో పలువురు తెలుగు స్టార్స్ తమకంటూ సొంత సినీ నిర్మాణ సంస్థలు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ బేనర్లలో ఇతర స్లార్లతో తమకు నచ్చిన సినిమాలు, కొన్ని సార్లు తమ సినిమాలు సైతం చేస్తున్నారు.

ఇప్పటికే రామ్ చరణ్, మహేష్ బాబు, సుధీర్ బాబు ఇలా పలువురు స్టార్స్ సొంతగా సినీ నిర్మాణ సంస్థలు పెట్టుకోగా... తాజాగా ఈ లిస్టులో సందీప్ కిషన్ కూడా చేరారు. 'వెంకటాద్రి టాకీస్' పేరుతో ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించినట్లు తెలుస్తోంది.

Sundeep Kishan Own banner Venkatadri Talkies

తన కెరీర్లో తొలి హిట్ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'.... ఈ సినిమా గుర్తొచ్చేలా 'వెంకటాద్రి టాకీస్' అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బేనర్లో సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా సైతం రూపొందుతోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు.

ప్రస్తుతం ఈ చిత్రాన్ని #NVNN పేరుతో పిలుస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు పూర్తి టైటిల్ రివీల్ కానుంది. మరో వైపు సందీప్ కిషన్ 'నెక్ట్స్ ఏంటి' అనే చిత్రంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X