కేటీఆర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో.. ఫిదా అవుతున్న కుర్ర హీరోలు!
తెలంగాణ 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తిరుగులేని మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనితో సినీ రాజకీయ ప్రముఖులంతా కేసీఆర్, కేటీఆర్, టిఆర్ఎస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ పేరు మారుమోగిపోతోంది. మరోమారు కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. హీరో రామ్, సందీప్ కిషన్ లాంటి యువ హీరోలంతా కేటీఆర్ గురించి ఆసక్తికరమైన ట్వీట్స్ చేస్తున్నారు.
ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో
హీరో రామ్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. కేటీఆర్ విజయనాదంతో వాయిద్యాలు మోగిస్తున్న ఫోటోని షేర్ చేశాడు. కేటీఆర్ గారు మీ కాన్ఫిడెన్స్ కేక అంటూ రామ్ ట్వీట్ చేశాడు. టిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినందుకు శుభాకాంక్షలు. మీరు ఈ విజయానికి పూర్తి అర్హులు అని హీరో రామ్ పేర్కొన్నాడు. తెలంగాణాని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తారని నమ్ముతున్నా అంటూ రామ్ పేర్కొన్నాడు.
చరిత్రాత్మకం
మరో యువ హీరో సందీప్ కిషన్ కూడా ట్విట్టర్ వేదికగా కేసీఆర్, కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది చారిత్రాత్మక విజయం అని సందీప్ కిషన్ పేర్కొన్నాడు. తెలంగాణతో పాటు హైదరాబాద్ కూడా మీపై నమ్మకం ఉంచింది అని సందీప్ కిషన్ పేర్కొన్నాడు.

వరుసగా సెలెబ్రిటీలు
మంచు మనోజ్, కోన వెంకట్, హరీష్ శంకర్ లాంటి సెలెబ్రిటీలంతా కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కేటీఆర్ కు చాలా మంది హీరోలు సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో కేటీఆర్ మంచి రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తున్నారు.

సినీ రాజకీయ వర్గాలు
మొత్తంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సినీ రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూసాయి. రాజకీయ ప్రముఖులతో పాటు టాలీవడ్ చిత్ర పరిశ్రమ కూడా ఎవరు విజయం సాధిస్తారా అని ఎదురుచూసింది. కానీ విజయం ఏకపక్షం అని ఫలితాలు ప్రారంభమైన కొద్దీ సేపటికే తెలిపింది.


Click it and Unblock the Notifications











