సందీప్ కిష్, రాశి ఖన్నా ‘జోరు’ (ఫస్ట్ లుక్ ఫోటోస్)
హైదరాబాద్: శ్రీకీర్తి ఫిలిమ్స్ పతాకంపై 'గుండెల్లో గోదారి' చిత్ర దర్శకుడు కుమార్ నాగేంద్ర తన రెండవ చిత్రంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జోరు'. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈచిత్రంలో 'ఊహలు గుసగుసలాడే' ఫేం రాశిఖన్నా హీరోయిన్. బ్రహ్మానందం, సప్తగిరి, ప్రియా బెనర్జీ, సుష్మా రాజ్, బాలయ్య, అజయ్, షియాజీ షిండే, సత్యం రాజేష్, కాశీ విశ్వనాథ్, హేమ, అన్నపూర్ణ ఇతర ముఖ్య భూమికలు పోషిస్తున్నారు.
యాక్షన్ కామెడీ ఎంటర్టెనర్ గా తయారవుతున్న 'జోరు' చిత్రం ఫస్ట్ లుక్ ని వినాయక చవితిని పురస్కరించుకుని విడుదల చేసారు. ఇప్పటికే పాటలతో సహా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న 'జోరు' చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి.
స్లైడ్ షోలో 'జోరు' సినిమాకు సంబంధించిన ఫోటోలు, వివరాలు...

విడుదల ఎప్పుడు?
సెప్టెంబర్ మూడో వారంలో ఆడియోని, అక్టోబర్ మొదటి వారంలో సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ‘జోరు' చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.

ఆకట్టుకుంటున్నాయి
సందీప్ కిషన్, రాశి ఖన్నా నటించిన ‘జోరు' ఫస్ట్ లుక్ చిత్రాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

కుమార్ నాగేంద్ర దర్శకత్వం
‘జోరు' చిత్రానికి కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా ఈచిత్రం సాగనుంది.

నటీనటులు
బ్రహ్మానందం, సప్తగిరి, ప్రియా బెనర్జీ, సుష్మా రాజ్, బాలయ్య, అజయ్, షియాజీ షిండే, సత్యం రాజేష్, కాశీ విశ్వనాథ్, హేమ అన్నపూర్ణ నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: మిరాఖ్, పాటలు: వనమాలి, భీమ్స్ సిసిరోలియో, ఫైట్స్: వెంకట్, డాన్స్: బాబా భాస్కర్, జాని, ఆర్ట్: మురళి కొండేటి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, కెమెరామెన్: ఎంఆర్ పళనికుమార్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు: అశోక్, నాగార్జున్, కథ-కథనం-మాటలు-దర్శకత్వం: కుమార్ నాగేంద్ర.


Click it and Unblock the Notifications











