రెజీనాతో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్ కిషన్
కొందరు సినిమా హీరోహీరోయిన్ల మధ్య ఎఫైర్స్ ఉన్నాయని, వారు డేటింగ్‌లో ఉంటున్నారని రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ వార్తలు నిజమా? లేక రూమర్సేనా అనేది సదరు హీరో గానీఎం హీరోయిన్ గానీ స్పందిస్తేనే తెలుస్తుంది. అయితే ఈ కోవలోనే యంగ్ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా మధ్య ఏదో ఉన్నట్టు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వార్తలపై తాజాగా హీరో సందీప్ కిషన్ రియాక్ట్ అయ్యాడు.
ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్ కిషన్.. అందరూ అనుకున్నట్లుగా తనకు, రెజీనాకు మధ్య ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. తమ మధ్య రిలేషన్ ఉందంటూ వస్తున్న వార్తలు పుకార్లే అని ఆయన అన్నాడు. రెజీనా కేవలం తనకు ఫ్రెండ్ మాత్రమే అని సందీప్ కిషన్ తెలిపాడు. అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడుకుంటానమని చెప్పాడు. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని, తన జీవితంలో ఏ అమ్మాయి లేదని సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు.

రెండేళ్ల క్రితం వరకు తాను ఓ అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, అయితే ఆ తర్వాత ఆ రిలేషన్ బ్రేక్ అయిందని తెలిపాడు. ఆ అమ్మాయి ఎవరనేది బయటకు చెప్పనని సందీప్ కిషన్ అన్నాడు. ప్రస్తుతం ఆమె జీవితం హాయిగా నడుస్తోందని, అలాగే తన జీవితం కూడా తాను హాయిగానే ఉందని చెప్పాడు. ఇలా పబ్లిక్ గా ఈ అమ్మాయి పేరు చెప్పడం సరైంది కాదని ఆయన అన్నాడు.
తెలుగు ప్రేక్షకులను తనదైన శైలిలో అలరిస్తూ వస్తున్న సందీప్ కిషన్.. మరికొద్ది రోజుల్లో నిను వీడని నీడను నేనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. జూలై 12న ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు రెజీనా కూడా తన ప్రాజెక్టులతో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











