చూసారా? :సందీప్ కిషన్ కొత్త చిత్రం 'నగరం' ట్రైలర్ విడుదైంది, కొత్తగా ఉంది

సందీప్‌ కిషన్‌ హీరోగా, రెజీనా హీరోయిన్ గా రూపొందిన 'నగరం' కొత్త ట్రైలర్ విడుదల చేసారు.

By Srikanya

హైదరాబాద్ : సందీప్‌ కిషన్‌ హీరోగా, రెజీనా హీరోయిన్ గా అశ్వనికుమార్‌ సహదేవ్‌ సమర్పణలో ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పొటెన్షియల్‌ స్టూడియోస్‌ పతాకాలపై లోకేష్‌ దర్శకత్వంలో రూపొందిన వెరైటీ చిత్రం 'నగరం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కొత్త ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు అశ్వనికుమార్‌ సహదేవ్‌ మాట్లాడుతూ - ''ఒక నగరంలో 48 గంటల్లో నలుగురు వ్యక్తుల మధ్య జరిగే కథ ఇది. సందీప్‌ కిషన్‌ది ఒక స్టోరీ కాగా, రెజీనాది మరో స్టోరీ. శ్రీ అనే వ్యక్తిది ఇంకో స్టోరీ. ఈ మూడు స్టోరీలను కలుపుతూ ఒక డ్రైవర్‌ కథ వుంటుంది. ఈ నాలుగు కథలూ ప్యారలల్‌గా రన్‌ అవుతూ వుంటాయి. ఇది స్క్రీన్‌ప్లే బేస్డ్‌ మూవీ. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా అనిపిస్తుంది.

సినిమాలో సందీప్‌ కిషన్‌, రెజీనాలపై చిత్రీకరించిన ఒక మాంటేజ్‌ సాంగ్‌ సినిమాకి పెద్ద హైలైట్‌ అవుతుంది. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలా కాకుండా ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన కమర్షియల్‌ మూవీ ఇది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది. సినిమా మీద మాకు చాలా కాన్ఫిడెన్స్‌ వుంది.

శుక్రవారం రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాని బుధవారమే పాత్రికేయులకు షో వెయ్యాలనుకుంటున్నాం. సినిమా మీద మాకు అంత కాన్ఫిడెన్స్‌ వుంది. ఈ చిత్రాన్ని మార్చి 10న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. తప్పకుండా 'నగరం' మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X