ఈ ఫొటో లోనే సినిమా కాన్సెప్టు ఉందిట
హైదరాబాద్ : సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా హీరోలు తమ సినిమాలు ప్రమోషన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సందీప్ కిషన్ తన తాజా చిత్రం రారా కృష్ణయ్య ప్రమోషన్ కి సైతం ట్విట్టర్ ని వేదికగా చేసుకున్నాడు. తన చిత్రం కాన్సెప్టు ఈ ఫోటో చూసి అర్దం చేసుకోమంటూ పోస్ట్ చేసాడు. మీరు చూస్తున్నది అదే. సందీప్ కిషన్ , రెజీనా జంటగా ఎస్.వి.కె. సినిమా పతాకంపై సోలో వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తున్న రారా కృష్ణయ్య చిత్రానికి మహేష్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరో సందీప్ కు అన్నయ్యగా జగపతిబాబు నటిస్తున్నారు.
అలాగే ఈ విషయమై ట్వీట్ చేస్తూ... 'నా మొట్ట మొదటి లవ్ స్టొరీ 'రొటీన్ లవ్ స్టొరీ'. ఆ సినిమాలో ఎక్కువ కామెడీ లవ్ తక్కువ ఉంటుంది. కానీ రారా కృష్ణయ్యలో కామెడీ-లవ్ సమానంగా ఉంటుందని' ట్వీట్ చేసాడు.

వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ... వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం తరువాత సందీప్ కిషన్ సినిమాలపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగిన విధంగా ఈ చిత్రం ఉంటుంది. లక్ష్యం సినిమాలో గోపిచంద్ అన్నగా నటించిన జగపతిబాబు మళ్ళీ ఈ చిత్రంలో ఆ తరహా పాత్ర చేస్తున్నారు. ఇటీవల ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్న జగపతిబాబు లెజెండ్ సినిమాలో విలన్ గా చేసిన తరువాత ఆయన కమిట్ అయిన సినిమా ఇదే. ఈ సినిమాలో ఆయన పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు.
దర్శకుడు మహేష్ మాట్లాడుతూ.... ఈ సినిమాలో జగపతిబాబు గారి పాత్ర చాలా ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. ఆయన వేసే గెటప్ లు మెయిన్ హైలైట్స్ అవుతాయి. జగపతిబాబు, అల్లరి రవిబాబు, తనికెళ్ళ భరణి,బ్రహ్మాజీ, తాగుబోతు రమేష్ , నల్లవేణు, సత్యం రాజేష్, శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అచ్చు.


Click it and Unblock the Notifications











