సందీప్ కిషన్ ‘బీరువా’ ఫస్ట్ లుక్ పోస్టర్

By Bojja Kumar

హైదరాబాద్: సందీప్ కిషన్, సురభి జంటగా ఉషాకిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బీరువా'. కణ్మణి దర్శకత్వంలో రామోజీరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్ట్ కూడా విడుదల చేసారు. ఈ చిత్రానికి చోటా కె నాయుడు, థమన్, గౌతంరాజు, వెలింగొండ శ్రీనివాస్ లాంటి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తుండటం గమనార్హం.

 Sundeep Kishan's Beeruva first look

ఈ చిత్రంలో బీరువా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. కథానాయకుడికి ఎలాంటి సమస్య ఎదురైనా బీరువా సాయంతో అధిగమిస్తుంటాడు. ఆ సన్నివేశాలు వినోదాన్ని పంచిపెడతాయని అంటున్నారు. కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన చిత్రమిది. సందీప్‌కిషన్‌ అల్లరి కుర్రాడిగా చక్కటి అభినయం ప్రదర్శించాడని, తన చుట్టూ ఉన్నవాళ్లందరికీ చిక్కులు తెచ్చిపెడుతుంటాడని తెలుస్తోంది.

'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' తర్వాత ఒప్పుకొన్న సినిమా ఇది. నటుడిగా నాకు ఓ కొత్త అనుభవాన్నిచ్చింది. కథ, కథనం... అన్నీ కొత్త తరహాలో సాగుతుంటాయి. కణ్మణి ఈ చిత్రంతో నా నటనకు మరిన్ని మెరుగులు దిద్దారు. మా ఛోటా మావయ్య ప్రతీ సన్నివేశాన్నీ అందంగా చూపించారు. ఆయన సెట్‌లో ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. తమన్‌, గౌతంరాజు లాంటి సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేసింది. వెలిగొండ శ్రీనివాస్‌ రాసిన మాటలు త్రివిక్రమ్‌ను గుర్తుకు తెప్పిస్తాయి. 'బీరువా' తప్పకుండా ఒక మంచి వినోదాత్మక సినిమా అవుతుంది అన్నారు సందీప్ కిషన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X