‘c/o సూర్య’ టీజర్ చాలా బావుంది
సందీప్ కిషన్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం “c/o సూర్య”.
సందీప్ కిషన్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం "c/o సూర్య". నా పేరు శివ ఫేమ్ సుసీంథరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ మూవీ టీజర్ విడుదలైంది. హీరో నాని చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈచిత్రం టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. కబాలి చిత్రంలో యాక్షన్ తో ఓ కొత్త ట్రెండ్ సృష్టించిన అంబు, అరివు ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫి అందించారు.
టీజర్ అదుర్స్
‘c/o సూర్య' టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. మంచి ఎంటర్టెనర్ అనే ఫీలింగ్ కలిగిస్తుందని సందీప్ కిషన్ ఫ్యాన్స్ అంటున్నారు.

యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్
దర్శకులు సుసీంధరన్ అద్భుతమైన కథను రెడీ చేశారు. యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ ని కబాలి చిత్రానికి పనిచేసిన అంబు, అరియులు చేస్తున్నారు. ఈ చిత్రంలో మా హీరో సందీప్ కిషన్ ఓ మధ్యతరగతి యువకుడిగా కనిపించనున్నారు. సందీప్ తప్పకుండా కొత్త కేరక్టరైజేషన్ తో అందరిని ఆకట్టుకుంటాడు. మెహరిన్ పాత్ర చాలా అందంగా కనిపిస్తుందని నిర్మాత తెలిపారు.

ద్విబాషా చిత్రం
తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన డి.ఇమ్మాన్ గారిని తెలుగు తెరకు పరిచయం చేశాము. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు.

నటీనటులు, తెర వెనక
ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్, ఛాయాగ్రహణం: జె.లక్ష్మణ్ కుమార్, ఎడిటర్: కాశీవిశ్వనాధం, పాటలు: రామజోగయ్య శాస్త్రి-శ్రీమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె.సి, సహ-నిర్మాత: రాజేష్ దండా, సమర్పణ: శంకర్ చిగురుపాటి, నిర్మాత: చక్రి చిగురుపాటి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుసీంధరన్!


Click it and Unblock the Notifications











