వైరల్ వీడియో: యంగ్ హీరో రొమాంటిక్ సెన్స్.. హీరోయిన్‌తో రెచ్చిపోయి రొమాన్స్

యంగ్ హీరో సందీప్ కిషన్ రెచ్చిపోయి రొమాన్స్ చేశాడు. హీరోయిన్‌తో రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోయిన ఆయన పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. తన కొత్త సినిమా 'నిను వీడని నీడను నేనే' కోసం సందీప్ కిషన్ తనలోని రొమాంటిక్ సెన్స్ అంతా బయటకు తీశాడు.

సందీప్ కిషన్ హీరోగా నటిస్తూనే సొంతంగా నిర్మిస్తున్న సినిమా 'నిను వీడని నీడను నేనే'. విస్తా డ్రీమ్ మర్చంట్స్‌తో కలిసి సందీప్ కిషన్ నిర్మాణ సంస్థ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, వి స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దయా పన్నెం, విజి సుబ్రహ్మణ్యన్, సందీప్ కిషన్ అనే ముగ్గురు నిర్మాతలు ఈ సినిమా కోసం ఒక్కటయ్యారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. చిత్రంలో సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ హీరోయిన్ గా నటించింది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

హారర్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంది. కాగా తాజాగా ఈ చిత్రంలోని మొదటి పాట లిరికల్ వీడియోను విడుదల చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించింది చిత్రయూనిట్. ఈ లిరికల్ వీడియో మధ్యలో వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్లు హీటు పెంచేస్తున్నాయి. సందీప్ కిషన్, అన్యా సింగ్ లిప్ లాక్ సీన్స్, హీరో హీరోయిన్ రొమాన్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. నీరజ కోన సాహిత్యం అందించిన ఈ పాటకు ఎస్.ఎస్.తమన్ స్వరపరిచిన మెలోడి ప్లస్ అయింది.

 Sundeep Kishans Romantic Sence in Ninu Veedani Needanu Nene

చిత్రంలో వెన్నెల కిషోర్, పోసాని క్రిష్ణమురళి, మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి, రాహుల్ రామక్రిష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సందీప్ కిషన్ కెరీర్ లో డిఫెరెంట్ జానర్ లో వస్తున్న ఈ సినిమా అతిత్వరలో విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X