‘టైగర్’వచ్చేసాడు(ఫస్ట్ లుక్)

By Srikanya

హైదరాబాద్ : యంగ్ హీరోలు సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ కలసి నటిస్తున్న సినిమా ‘టైగర్'. మురుగదాస్ శిష్యుడు విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. మీరు ఇక్కడ చూస్తున్నది అదే. ఇటీవలే...సందీప్, రాహుల్ లపై ఓ పాటను తెరకెక్కించారు. ఈ సినిమాలో వీరిద్దరూ కలసి నృత్యం చేస్తున్న మొదటి పాట ఇది.

ఇద్దరు అగ్ర నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో సీరత్ కపూర్ హీరోయిన్. గంగ పాత్రలో నటిస్తుంది. సప్తగిరి, సుప్రీత్, తనికెళ్ల భరణి, పృథ్వీరాజ్, ప్రవీణ్, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. గంగానది నేపథ్యంలో విభిన్న కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది.

 Sundeep Kishan's Tiger first look

కాశీలో ఈ సినిమా ముఖ్య సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు, సంగీత దర్శకుడు తమన్, మాటల రచయిత అబ్బూరి రవి వంటి టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. మరో ప్రక్క సందీప్ కిషన్...బీరువా చిత్రం విడుదల కు రెడీ అవుతోంది.

‘బీరువా' విశేషాలకి వస్తే...

సందీప్‌ కిషన్‌, సురభి జంటగా కణ్మణి దర్శకత్వంలో ఉషాకిరణ్‌ మూవీస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బీరువా'. రామోజీరావు నిర్మాత. ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరాలందించారు.

హీరో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘‘ఉషాకిరణ్‌ మూవీస్‌ లాంటి పెద్ద సంస్థలో సినిమా చెయ్యడం నా అదృష్టం. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో జెమిని కిరణ్‌గారు నన్ను మరో మెట్టెక్కించారు. ఇందులో నా పాతర వైవిధ్యంగా ఉంటుంది. నటనలో నా పరిధిని పెంచే సినిమా ఇది. కుటుంబం మొత్తం చూసేలా దర్శకుడు మలిచారు. తమన్‌ చక్కని స్వరాలందించారు. ప్యూచర్‌లో ఆయనతో మరిన్ని సినిమాలు చెయ్యబోతున్నా'' అని అన్నారు.

 Sundeep Kishan's Tiger first look

దర్శకుడు కణ్మణి మాట్లాడుతూ ‘‘ఎప్పటి నుంచో ఉషాకిరణ్‌ సంస్థలో సినిమా చెయ్యాలని ప్రయత్నిస్తున్నా. ‘బీరువా'తో కుదిరింది. నా తొలి సినిమాలాగా భావించి తెరకెక్కించాను. కమర్షియల్‌ హంగులతో వినోదాత్మకంగా సాగుతుంది. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇది'' అని తెలిపారు.

‘‘కణ్మణి ఎంతో క్లారిటీతో ఈ సినిమా తెరకెక్కించారు. కథానుగుణంగా చక్కని పాటలు రాబట్టుకున్నారు. సందీప్‌ కెరీర్‌ని మలుపు తిప్పే చిత్రమిది'' అని ఎస్‌.ఎస్‌.తమన్‌ అన్నారు. ‘‘తెలుగులో తొలి సినిమా ఇది. నాయికగా గుర్తింపు తెచ్చే పాత్ర చేశాను'' అని సురభి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X