మెగా నిర్మాతతో సందీప్ కిషన్ ‘టైగర్’
హైదరాబాద్: యువ హీరో సందీప్ కిషన్ త్వరలో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇద్దరు అగ్ర నిర్మాతలు ఎన్.వి.ప్రసాద్, ‘ఠాగూర్' మధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి ‘టైగర్' టైటిల్ ఖరారు చేసారు. మంగళవారం కాశీలో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ఏఆర్ మురుగదాస్ శిష్యుడు వి.ఐ.ఆనంద్ ఈచిత్రానికి దర్శకుడు.
ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు చోటా కె.నాయుడు, సంగీత దర్శకుడు థమన్, మాటల రచయిత అబ్బూరి రవి లాంటి హేమాహేమీలంతా ఈ సినిమాకు పని చేస్తున్నారు. సీరత్ కపూర్ కథానాయిక. రాహుల్ రవీంద్ర, సప్తగిరి, సుప్రీత్, తనికెళ్ల భరణి, పృథ్వీరాజ్, ప్రవీణ్, కాశీ విశ్వనాథ్ ఇందులో ముఖ్య తారలు.

ఎన్.విఆర్. సినిమా పతాకంపై ‘ఠాగూర్' మధు సమర్పణలో ఎన్.వి.ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ..‘గంగానది నేపథ్యంలో సాగే విభిన్న కథాంశమిది. కాశీ, అలహాబాద్, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్ లాంటి లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతాం. కాశీలో పది రోజులు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టెనర్. సందీప్ కిషన్ ను హీరోగా మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా' అవుతుందని తెలిపారు.
ఈచిత్రానికి ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, ఫైట్స్: వెంకట్, ఆర్ట్: రాము, ఆఫీస్ ఇన్ చార్జ్: భగ్గా రామ్, కో డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, లైన్ ప్రొడ్యూసర్: జి. నాగేశ్వరరావు.


Click it and Unblock the Notifications











