ఓ రాత్రి రైలులో ... (‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ప్రివ్యూ)
హైదరాబాద్ : సందీప్‌కిషన్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'ఈ రోజు విడుదల అవుతోంది. ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య ట్రైన్ జర్నీలో కలిగిన అనుభవాలు సమాహారమే ఈ చిత్రమని,ఆ సీన్స్ ఆహ్లాదాన్ని కలిగిస్తాయని దర్శకుడు చెప్తున్నారు.
కథేమిటంటే... సందీప్ (సందీప్ కిషన్) అల్లరి అబ్బాయిసందీప్ కు తప్పులు చేయడం హాబీ. కానీ కుటుంబం అంటే అతనికు చాలా ఇష్టం. వాళ్లని వదిలి ఉండలేడు. అతని నాన్న మాత్రం శిశుపాలుడిలా వంద తప్పుల వరకే పరిమితి ఇచ్చారు. తొంభై తొమ్మిది తప్పులు చేసేశాడు. మిగిలిన ఒక్క తప్పు చేయకుండా ఎలా తప్పించుకోవాలి అనుకున్న సమయంలో అతను తన సోదరుడు పెళ్లికి తిరుపతి కి సకుటుంబ సమేతంగా బయిలు దేరతాడు. అక్కడే హీరోయిన్ పరిచయమవుతుంది. ఆమె విషయానికి వస్తే ఆమె పేరు ప్రార్థన (రకుల్ ప్రీత్‌సింగ్) . చాలా ప్రాక్టికల్ ...లెక్కల మనిషి. ఇద్దరూ రైల్లో పరిచయం అవుతారు. ఇద్దరి గమ్యం ఒక్కటే. తిరుపతి వెళ్లాలి. కానీ కారణాలు వేరు. ఈ రైలు ప్రయాణం వీరి జీవితాల్ని ఎలా మలుపు తిప్పింది? అనేదే ఈ చిత్ర కథ. ఎక్కువ భాగం రైలులోనే జరుగుతుంది.

హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ... ''ఈ సినిమాలో నా పాత్ర పేరు ప్రార్థన. 'ప్రతీ రూపాయీ కౌంటింగ్ ఇక్కడ' అంటుంటా. నా తొలి జీతం తిరుపతి హుండీలో వేయడానికి కాచిగూడ నుంచి తిరుపతి బయల్దేరతాను. మధ్యలో ఓ అల్లరి అబ్బాయి పరిచయం అవుతాడు. నా ముఫ్పైవేలూ తనే ఖర్చుపెట్టేస్తాడు. హుండీలో వేయడానికి ఒక్క రూపాయీ మిగల్లేదు. ఆ అబ్బాయికీ, నాకూ మధ్య ఏం జరిగిందనేది తెరపైనే చూడాలి. ఇదో తమాషా కథ. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో పదకొండు రోజులు చిత్రీకరణ జరిపారు. రైలు వెనుక నేనూ, సందీప్‌కిషన్ పరుగులు పెట్టాం. అవన్నీ గమ్మత్త్తెన అనుభవాలు'' అన్నారు.
దర్సకుడు మాట్లాడుతూ... ''రచయిత మేర్లపాక మురళిగారి అబ్బాయిని. నాకిదే తొలి సినిమా. అంతకు ముందు 'ఖర్మరా దేవుడా' అనే లఘుచిత్రం చేశా. దానికి పురస్కారాలొచ్చాయి. ఆ అనుభవంతోనే ఈ సినిమా తీశా. ఛోటా.కె నాయుడు, రమణగోగుల లాంటి అనుభవజ్ఞులు ఉండడం వల్ల నా పని తేలికైంది. ఇదో అందమైన రైలు ప్రయాణం. రాత్రి మొదలై.. ఉదయం ముగుస్తుంది. ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఏం జరిగింది? అనేది ఆసక్తికరంగా చెబుతున్నాం. 3 పాటలున్నాయి. అవి సందర్భానుసారంగా వచ్చేవే'' అన్నారు.
సినిమా: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
సంస్థ: ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్
నటీనటులు: సందీప్‌కిషన్, రకుల్ ప్రీత్‌సింగ్, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, బ్రహ్మాజీ, నాగినీడు, పృథ్వీ, తాగుబోతు రమేశ్, సప్తగిరి, కమల్, ప్రవీణ్, నిఖిల్, నర్సింగ్ యాదవ్, మీనా, సంధ్య తదితరులు.
సంగీతం: రమణ గోగుల;
పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, కాసర్ల శ్యామ్,
కూర్పు: గౌతంరాజు,
కళ: సాహి సురేశ్,
నిర్మాత: కిరణ్;
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: మేర్లపాక గాంధీ.
విడుదల: 29-11-2013 (శుక్రవారం)


Click it and Unblock the Notifications











