కరెంట్ బిల్లులు వీకెండ్ కలెక్షన్స్‌లా ఉన్నాయి..యంగ్ హీరో సెటైర్స్
కరెంట్ షాక్ కొడుతుందని అందరికీ తెలిసిందే అయినా.. కరెంట్ బిల్లు చూస్తే కూడా షాక్ కొడుతుందని ప్రతీ ఒక్కరికీ తెలుస్తోంది. సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు ఈ కరెంట్ బిల్లుల షాక్ తగులుతోంది. పూరి గుడిసెలో ఉన్నా అద్దాల మేడలో ఉన్నా ఒకే రకమైన బిల్లులు రావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ మేరకు తమకు ఎక్కువగా బిల్లు వచ్చిందని సెలెబ్రిటీలు సైతం వాపోతోన్నారు. మొదటగా ఈ విషయంపై హీరోయిన్ స్నేహా భర్త ప్రసన్న స్పందించాడు.
నటుడు ప్రసన్న తమకు వచ్చిన బిల్లుపై ప్రభుత్వాన్ని, తమిళ నాడు విద్యుత్ బోర్డును ప్రశ్నించాడు. ఎందుకు ఇంత బిల్లు వేశారని, ఎప్పుడూ తమకు ఇంత మొత్తంలో రాలేదని పున: పరిశీలించాలని కోరాడు. తాజాగా తాప్సీ సైతం తనకు వచ్చిన బిల్లును చూసి షాక్ అయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీ చోట ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయి. అయితే లాక్ డౌన్ కారణంగా రెండు మూడు నెలలు రీడింగ్ చూడకపోవడం, అన్నీ ఒకేసారి లెక్కించడంతో ఇలా జరుగుతోందనే వాదన వినిపిస్తోంది.

తాజాగా కరెంట్ బిల్లులపై సందీప్ కిషన్ స్పందించాడు. వేలల్లో వస్తోన్న ఈ బిల్లులపై తన దైన శైలిలో సెటైర్స్ వేశాడు. ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ చూస్తుంటే చిన్నతనంలో ఆటోరిక్షాల మీటర్లు చూసినట్టు అనిపిస్తోందని తెలిపాడు. ఏంది సార్ ఆ బిల్లు.. నెక్స్ట్ ఎవరి ఇంటికి ఎక్కువ బిల్ వచ్చిందని ఆన్ లైన్ వార్ స్టార్ అయినా ఆశ్చర్యం లేదని చెప్పుకొచ్చాడు. ఈ బిల్లులు కొత్త సినిమా వీకెండ్ కలెక్షన్లల ఉన్నాయని కౌంటర్ వేశాడు.


Click it and Unblock the Notifications











